Friday, September 6, 2024

Andhra Pradesh – కేంద్ర బ‌డ్జెట్ లో ఎపికి నిధులే.. నిదులు. ..

కేంద్ర బడ్జెట్ లో ఈసారి ఎపికి భారీగా నిధులు కేటాయించారు.. అమరావతి అభివృద్ధికి రూ. 15 వేల కోట్లు.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రత్యేక సాయం.. బడ్జెట్‌లో రూ. 15 వేల కోట్లు ప్రకటించిన కేంద్రం.. విభజన చట్టం కింద పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటు.. విశాఖ- చెన్నై, ఓర్వకల్లు- హైదరాబాద్ ఇండస్ట్రీ కారిడార్ల ఏర్పాటు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి సాయం చేస్తాం.. ఏపీ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం.. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సాయం చేస్తాం.. ఈ ఆర్థిక సంవత్సరంలోనే సాయం.. అవసరాన్ని బట్టి అదనపు నిధులు కేటాయిస్తాం.. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రతో పాటు వెనకబడిన జిల్లాలకు నిధులు.. వాటర్, పవర్, రైల్వే, రోడ్ల రంగంలో ఏపీకి అండగా నిలుస్తాం. అని నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించారు.

ఈశాన్య రాష్ట్రాల‌కు ప్ర‌త్యేక ప్యాకేజీలు

ఈశాన్య రాష్ట్రాల్లో 100 పోస్టల్ పేమెంట్ బ్యాంకుల ఏర్పాటు.. ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేక ప్యాకేజీ.. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంట్ స్కీం.. సులభంగా రుణం అందేలా చర్యలు.. ముద్ర రుణాలు రూ.10 నుంచి 20 లక్షలకు పెంపు.. 100 ఫుడ్‌ క్వాలిటీ ల్యాబ్స్ ఏర్పాటు.. 12 ఇండస్ట్రీయల్ పార్కుల ఏర్పాటు.. క్రిటికల్ మినరల్‌ మిషన్ ఏర్పాటు.. పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ.. 30 లక్షలకు పైగా జనాభా ఉన్న 14 పట్టణాల్లో ప్రత్యేక చర్యలు. -నిర్మలా సీతారామన్.

- Advertisement -

ప‌ట్ట‌ణ గృహ నిర్మాణ‌ల‌కు భారీగా నిధులు

పట్టణాల్లో గృహ నిర్మాణానికి 10 లక్షల కోట్లు ఈ బ‌డ్జెట్ లో కేటాయించారు… 100 పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు.. పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన.. కోటి ఇళ్లకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.. అణు విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి.. కొత్త రియాక్టర్ల ఏర్పాటుకు చర్యలు.. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద మరో 3 కోట్ల ఇళ్లు.. పట్టణాల్లో కోటి ఇళ్ల నిర్మాణం. చేప‌డ‌తామ‌ని నిర్మల తెలిపారు.

స‌డ‌క్ యోజ‌న కు పెద్ద నిధులు

ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్ యోజనకు పెద్దపీట వేశారు.. 25 వేల గ్రామాలకు కొత్తగా రోడ్లు.. బీహార్‌లో వరదల వల్ల తీవ్ర ఇబ్బందులు.. కోసీ నదిపై ప్రాజెక్టులు, నదుల అనుసంధానానికి రూ.11,500 కోట్లు.. అసోంలో బ్రహ్మపుత్ర వరదల వల్ల తీవ్ర నష్టం.. అసోంలో ప్రాజెక్టుల నిర్మాణానికి పెద్దపీట.. సిక్కిం, ఉత్తరాఖండ్‌లో వరదలు, భారీ వర్షాలతో తీవ్ర నష్టం.. ఈ రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక సాయం.. గయా బుద్ధగయాలో కాశీ తరహా కారిడార్‌.. ఒడిశాలోన ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు. కేటాయించింది.

మోలిక స‌దుపాయ‌ల‌కూ..

మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో మరోసారి కేంద్రం పెద్దపీట వేశారు. ఈ బడ్జెట్‌లో రూ.11.11 లక్షల కోట్లు కేటాయించారు. ఈ మొత్తం జీడీపీలో 3.4 శాతానికి సమానం

బీహార్ లో రోడ్ల నిర్మాణానికి 26 వేల కోట్లు

బీహార్‌లో రోడ్ల నిర్మాణానికి పెద్దపీట వేసిన‌ట్లు నిర్మ‌ల ప్ర‌క‌టించారు. ఏకంగా దీనికోసం . రూ.26,000కోట్లు కేటాయించారు. ఇక . రాజ్‌గిరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక.. నలంద యూనివర్సిటీని టూరిస్ట్‌ సెంటర్‌గా అభివృద్ధి చేస్తాం.. భూముల పరిరక్షణ కోసం డిజిటల్ భూ- ఆధార్..

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి పూర్వోదయ పథకం.. బీహార్‌, ఏపీలోనూ పూర్వోదయ పథకం అమలు.. గంగానదిపై మరో రెండు బ్రిడ్జీలు.. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణ.. బడ్జెట్‌లో బీహార్‌కు పెద్దపీట.. బీహార్‌కు ఎక్స్‌ప్రెస్‌వేలు, రహదారులు.. ప్రతి ఏటా 25 వేల మంది విద్యార్థులకు శిక్షణ.. ఉన్నత విద్య చదివే వారికి 10 లక్షల వరకు విద్యారుణం.. ప్రతి ఏటా లక్ష మందికి విద్యా రుణం.. మూడు శాతం వడ్డీతో విద్యారుణం

రాష్ట్రాల‌కు వ‌డ్డీ లేని రుణాలు
రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీలేని రుణాలు.. స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి.. మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తగ్గించారు ఈ బ‌డ్జెలో ..

Advertisement

తాజా వార్తలు

Advertisement