కోవిడ్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. అందులో భాగంగా మన దేశంలో కూడా కేసులు పెరగడం మొదలైంది. ఈ నేపథ్యంలో మెడికల్ ఆక్సిజన్ లభ్యతపై కేంద్రం ఆరా తీసింది. ఈ మేరకు ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. ఆక్సిజన్ లభ్యతపై ప్రతివారం సమీక్షించాలని కేంద్రం సూచించింది. రాష్ట్రాల్లో ఆక్సిజన్ కంట్రోల్ రూమ్స్ మళ్లీ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని తెలిపింది. బ్యాకప్ స్టాక్ ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement