Tuesday, November 19, 2024

AP | జగన్ ప్రభుత్వంపై కేంద్రం చర్యలు తీసుకోవాలి : మాణిక్యం ఠాగూర్

ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూరో : రాష్ట్రంలో పెద్ద స్థాయిలో అక్రమణ మైనింగ్ జరుగుతుందని కేంద్రమే నివేదిక ఇచ్చింది. ఎందుకని చర్యలు తీసుకోవడం లేదో ప్రధాని మోడీ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని పార్లమెంట్ సభ్యుడు ఏపీసీసీ ఆంధ్ర ప్రదేశ్ బాధ్యులు మాణిక్యం ఠాగూర్ అన్నారు. విజయవాడలోని ఆంధ్ర రత్న భవనంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రధాని మోడీతో పాటు బిజెపి పార్టీపై మండిపడ్డారు. వందల కోట్లు లెక్కల్లో చూపని డబ్బు అక్రమ మైనింగ్ లో చేతులు మారుతున్నాయని ఠాగూర్ అన్నారు.

జగన్ తప్పులు చేస్తూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వం 16 సార్లు లోక్సభ రాజ్యసభలో మద్దతు పలికారని అన్నారు. పలు కీలక బిల్లులు ఆమోదం పొందడానికి మోడీ ప్రభుత్వానికి మద్దతు పలికారని ఠాగూర్ విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా మోడీ ప్రభుత్వానికి బైండోవర్ అయ్యారని ఆయన అన్నారు. ఇది మూడవ మండల జోన్ ప్రెసిడెంట్ల మీటింగ్ విశాఖలో గత మూడు రోజులుగా బూత్ స్థాయి సమావేశాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ సమావేశంలో ఆయన తో పాటు పీ.సీ.సీ. మాజీ అధ్యక్షులు సి.డబ్ల్యూ.సి. నెంబర్ గిడుగు రుద్దరాజు, కొప్పుల రాజు వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement