Saturday, November 23, 2024

Ration: కేంద్రం కోటా కట్‌.. ఏప్రిల్‌ నుంచి ఉచిత బియ్యం బంద్​..

అమరావతి, ఆంధ్రప్రభ: కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యంను ఈనెలఖరు నుంచి నిలపివేయనుంది. ప్రతినెలా 1.47 కోట్ల రేషన్‌ కార్డులకు గాను ప్రతినెలా 1.91 లక్షల టన్నుల బియ్యాన్ని ఉచితంగా ప ంపిణీ చేస్తోంది. కరోనా థర్డ్‌ వేవ్‌ పూర్తవ్వడం, క్రమేపీ సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఉచిత బియ్యం పంపిణీకి ఫుల్‌స్టాప్‌ పెట్టాని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం కేజీ రూపాయి చొప్పున సరఫరా చేసే బియ్యం పథకం యథావిధిగా కొనసాగనుం ది. కోవిడ్‌ 19 విజృంభణ నేపథ్యంలో 2020 మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ ప్రక్రియ మొదలైంది. కరోనా మొదటి విడత పరిస్థితుల్ని అంచనా వేయడంలో ప్రభుత్వాలు సైతం విఫలమయ్యాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదల ఉపాధికి గండిపడింది. వ్యాపార, వాణిజ్య లావాదేవీలు మందకోడిగా సాగడంలో తీవ్ర ఆర్థిక మాంధ్యం నెలకొంది. పేదల జీవితాల్లో ఆకలికేకలు మొదలయ్యాయి. ఈక్రమంలో ప్రధాని మోడీ మే 2020 నుంచి తెల్లరేషన్‌ కార్డుదారులకు ఉచిత బియ్యం పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా కేజీ రూపాయి చొప్పున పంపిణీ చేసే బియ్యం పథకానికి తోడు అదనంగా ఒక్కో కుటుంబానికి 13 నుంచి 20 కేజీల చొప్పున ఉచితంగా బియ్యంను పంపిణీ చేశారు. ఆ ఏడాది నవంబర్‌ నెల వరకు ఉచిత బియ్యం పంపిణీ సాగింది. కరోనా మొదటి వేవ్‌ పూర్తవ్వడంతో అదే ఏడాది డిసెంబర్‌ నుంచి ఈ పథకాన్ని కేంద్రం నిలిపివేసింది. 2021 మార్చినెలలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఒక్కసారిగా విరుచుకుపడింది. ఊహకు అందని విషమ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దసంఖ్యలో మరణాలు సంభవించాయి. ఈక్ర మంలో అదే ఏడాది మే నుంచి కేంద్రం మళ్లిd ఉచిత బియ్యం పథకాన్ని అమలు చేసింది అదే ఏడాది నవంబర్‌ వరకు కొనసాగించింది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జోరుగా సాగడంతో థర్డ్‌ వేవ్‌ లో పెద్దగా ప్రమాదం సంభవించలేదు. ఈ ఏడాది జనవరి నుంచి మూడు నెలలపాటు కొనసాగించిన ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని ఈనెలాఖరుతో నిలిపివేయనుంది.
ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేజీ రూపాయి చొప్పున పంపిణీ చేసే 20 కేజీలతో పాటు కేంద్రం ఉచితంగా ఇస్తున్న 20 కేజీలు వెరసి 40 కేజీల చొప్పున (తెల్లరేషన్‌) కార్డుదారుల కుటుంబాలకు అందేవి. కొందరు లబ్ధిదారులు ఈ బియ్యాన్ని తీసుకోవడానికి ముందుకు రాకపోవడంతో అక్రమార్కుల పంట పండింది. పేదల నుంచి కేజీ రూ.7 చొప్పున కొనుగోలు చేసి రైస్‌మిల్లుల్లో పాలిష్‌ పట్టి వాటికో బ్రాండ్‌ తగిలించి మార్కెట్‌లో కేజీ రూ.40 చొప్పున విక్రయించి అక్రమార్కులు సొమ్ము చేసుకున్నారన్నది బహిరంగ రహస్యం. బియ్యం అక్రమ నిల్వలు, తరలింపుపై టాస్క్‌ఫోర్స్‌, విజిలెన్స్‌ శాఖలు మెరుపుదాడులు నిర్వహించినప్పటికీ దొరికింది గోరంతే.

Advertisement

తాజా వార్తలు

Advertisement