అమరావతి, ఆంధ్రప్రభ: 2విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాలను పెంపొందించడంలో గణనీయ మైన అభివృద్ధి సాధించేలా జల విద్యుత్ విస్తరణ కోసం చేపట్టబోయే ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ పర్యావరణ అనుమతి ఇచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (ఏపీ జెన్‌కో) చిరకాల వాంఛ నెరవేరింది. దిగువ సీలేరు హైడ్రో పవర్ హౌస్ వద్ద 115 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్ల ఏర్పాటు-కు మార్గం సుగుమమైంది. ప్రస్తుతం ఇక్కడ 115 మెగావాట్ల సామర్ధ్యంతో నాలుగు యూనిట్లు- పనిచేస్తుండగా తాజా అనుమతులతో 115 మెగావాట్ల సామర్ధ్యం గల ఆరు యూనిట్లకు పెరగనుంది. అల్లూరి సీతారామ రాజు జిల్లాలోని చింతూరు మండలం మోతు గుండెం వద్ద పవర్ కెనాల్ పనులను మెరుగుపర్చనున్నారు. ఈమేరకు కేంద్ర పర్యా వరణ, అటవీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంపాక్ట్ అసెస్‌మెంట్ విభాగం నుండి ఏపీ జెన్‌కోకు అనుమతికి సంబంధించిన ఆదేశాలు అందాయి. ఏపీ జెన్‌కో 1978 నుండి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం, మోతుగూడెం వద్ద గల సిలేరు కాంప్లెక్స్‌లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది. ఇక్కడ స్థాపిత సామర్థం 4115 మెగావాట్లగా ఉంది. పవర్ హౌస్ నిర్మాణ సమయంలో, భవిష్యత్తులో 115 మెగావాట్ల మరో రెండు యూనిట్లను ఏర్పాటు- చేయడానికి అవకాశం కల్పించేలా అప్పట్లోనే ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు, ఏపీజెన్‌కో పీక్ -టైమ్ డిమాండ్‌ను తీర్చడానికి, ప్రీమియం ధరకు విద్యుత్ కొనుగోలును నివారించడానికి అదనపు యూనిట్ల నిర్మాణాన్ని చేపట్టింది. తద్వారా ఏపీ జెన్‌కోకి విద్యుత్, డబ్బు రెండూ ఆదా అవనున్నాయి.
అనుమతులు వచ్చింది ఇలా…..
ఏపీ జెన్‌కో ఇందుకోసం అవసరమైన పర్యావరణ క్లియరెన్స్ కోసం కేంద్రానికి దరఖాస్తు చేసి కేంద్ర పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ సూచించిన నిబంధనలను పూర్తి చేసింది. దీంతో పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ) అధ్యయనాలను కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఈక్రమంలోనే గత ఏడాది ఫిబ్రవరి 27న ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఇప్పుడు, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఈఏడాది ఏప్రిల్ 24న ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతినిచ్చింది.
పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ చేరుకునేలా….
ఏపీ జెన్‌కోలో 2024 చివరి నాటికి రూ. 415 కోట్లతో ఈ పనులను పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతోందని ఇంధన శాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీ కే విజయానంద్ తెలిపారు. స్థానిక ప్రజలు మరియు చుట్టు-పక్కల గ్రామాల ప్రయోజనాల కోసం రూ.11 కోట్ల వ్యయంతో పర్యావరణ పరిరక్షణకు కేంద్ర మంత్రిత్వ శాఖ పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ)ని అమలు చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరంతర పర్యవేక్షణ, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సహకారం వల్లే ఇన్ని ప్రధానమైన మైలురాళ్లు సాధించగలిగామని విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అనేక రెట్లు- పెరిగిందని, 2023 ఏప్రిల్ 20న రికార్డు స్థాయిలో 247 మిలియన్ యూనిట్లకు (ఎంయూ) చేరుకుందని తెలిపారు. ఏప్రిల్-2023 నెలలో సగటు- విద్యుత్ వినియోగం 5 నుంచి 6 శాతం పెరిగిందని వివరించారు. రానున్న రోజుల్లో డిమాండ్ రోజుకు 250 ఎంయూలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. దిగువ సీలేరు వద్ద అదనంగా 2115 మెగావాట్ల జలవిద్యుత్తు భవిష్యత్తులో ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి దోహదపడుతుందని ఆయన అన్నారు.
తక్కువ సమయంలోనే పూర్తి
దిగువ సిలేరు జలవిద్యుత్ ప్రాజెక్ట్‌లో అదనపు యూనిట్ల ఇన్‌స్టాల్ చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఇప్పటికే ఉన్నందున, తక్కువ సమయంలో పనులు పూర్తవుతాయని గురించి జెన్‌కో ఎండీ చక్రధర బాబు తెలిపారు. యూనిట్లను త్వరగా ప్రారంభించే అవకాశముందన్నారు. అదనపు యూనిట్లను అందించే కాంట్రాక్టర్ ఇప్పటికే అందుబాటు-లో ఉన్నందున, పనులను ఒకేసారి ప్రారంభించి వీలైనంత తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చని తెలిపారు. దేశంలోని అత్యుత్తమ విద్యుత్ ఉత్పత్తి సంస్థలలో ఒకటిగా పరిగణించబడుతున్న ఏపీ జెన్‌కోని బలోపేతం చేయడానికి తాము ఏ అవకాశాన్ని వదిలిపెట్టమని ఆయన స్పష్టంచేశారు. ఏపీ జెన్‌కో అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి మరియు పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడానికి సన్నద్ధంగా ఉందని పేర్కొంటూ, ఏపీ పవర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమి-టె-డ్ (ఏపీపీడీసీఎల్)-శ్రీ దామోదర సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ 2వ దశలో 800 మెగావాట్ల ప్రాజెక్ట్ ముఖ్యాంశాల గురించి వివరించారు. ఇక్కడ స్టేజ్-2గా చేపట్టిన 800 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన సూపర్‌క్రిటికల్ యూనిట్-3, మార్చి 10, 2023 నుండి పనిచేస్తోందన్నారు. యూనిట్ దాదాపు 16 ఎంయూ విద్యుత్‌తో రోజువారీ వినియోగానికి సహకరిస్తోందని, ఏపీ స్టేట్ గ్రిడ్ లో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ యూనిట్ ఏప్రిల్ 15, 2023న గరిష్టంగా 793 మెగావాట్ల లోడ్‌తో అత్యధికంగా 17.304 ఎంయూని ఉత్పత్తి చేసిందన్నారు. సూపర్ క్రిటికల్ యూనిట్‌గా ఉన్నందున, సబ్-క్రిటికల్ యూనిట్లతో పోలిస్తే విద్యుత్ ఉత్పత్తిలో ఇది అధిక సామర్థ్యం, ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్)తో కార్బన్ ఉద్గారాలను తీవ్రంగా తగ్గించడంతో పాటు- ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటు-ంది. 800 మెగావాట్ల డా. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ (డాక్టర్ ఎన్‌టిటిపిఎస్) ఒక నెలలో వినియోగంలోకి రాబోతోందని, యూనిట్ ప్రారంభించిన 3 నెలల తర్వాత వాణిజ్య కార్యకలాపాలు ఉంటాయని అన్నారు.