Friday, November 22, 2024

పోల‌వ‌రం ఎత్తుపై కేంద్రం ట్విస్ట్….

న్యూఢిల్లీ – గ‌త వారం పార్ల‌మెంట్ లో వైసీపీ ఎంపీ సత్యవతి పోల‌వ‌రం ఎత్తుపై అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని తేల్చి చెప్పారు.. ప్ర‌క‌ట‌న వ‌చ్చి నాలుగు రోజులు గ‌డ‌వ‌క ముందే పోలవరం పై కేంద్ర ప్రభుత్వం మళ్లీ మాట మార్చింది. తాజాగా నేడు రాజ్యసభలో ప్రాజెక్టు ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ 45.72 మీటర్లని కేంద్రం స్పష్టం చేసింది. పోలవరం పురోగతిపై రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో టిడిపి రాజ్య‌స‌భ స‌భ్యుడు ఎంపీ కనకమేడల రవీంద్ర పోల‌వ‌రం ఎత్తుపై ప్ర‌శ్న వేశారు.. దీనికి కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖిత పూర్వకంగా సమాధానమిస్తూ, 1980 నాటి గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లు అని ఆ మేర‌కే నిర్మాణ ప‌నులు కొన‌సాగిస్తున్నామ‌ని పేర్కొన్నారు.. నీటి నిల్వ సామర్ధ్యం 41.15 కి తగ్గించాలంటూ ఏపీ ప్రతిపాదించినట్టు తమకు సమాచారం లేదని తెలిపారు. ఇటీవలే అసెంబ్లీలో సీఎం జగన్ కూడా మొదటి దశలో 41.15 మీటర్ల కాంటూర్ దగ్గరే నీటి నిల్వ చేస్తామని ప్రకటించారు. అయితే అటువంటి ప్ర‌తిపాద‌న ఏదీ ఎపి ప్ర‌భుత్వ నుంచి త‌మ‌కు అంద‌లేద‌ని మంత్రి తుడు తేల్చి చెప్పారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement