ఆంధ్రప్రభ బ్యూరో: నెల్లూరు జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సిందియా ఉత్తర్వులు జారీ చేశారు. టెలికాం అడ్వైజరీ కమిటీకి ఎంపీ వేమిరెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు.
జిల్లా టెలికాం అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఆత్మకూరు నియోజకవర్గం మర్రిపాడు మండలానికి చెందిన కటారి రమణయ్య, కందుకూరు నియోజకవర్గం వలేటివారిపాలేనికి చెందిన గుర్రం మాల్యాద్రి, నెల్లూరు రూరల్ శ్రీహరి నగర్‌కు చెందిన బొప్పూరు ప్రసాద్, కావలి నియోజకవర్గానికి చెందిన కుట్టుబోయిన బ్రహ్మానందం, నెల్లూరు సిటీకి చెందిన ఏటూరి రమేష్ బాబు, కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేటకు చెందిన ముంగర గోపాల్, ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలానికి చెందిన తాటికొండ అనూష, నెల్లూరు రూరల్‌కు చెందిన వేదనపర్తి సురేంద్ర రెడ్డి ఎంపికయ్యారు.