వెదురుకుప్పం, (ప్రభ న్యూస్) : రామచంద్రాపురం మండలంలోని అనుపల్లి- వెదురు కుప్పం మార్గమధ్యమైన అనుప్పల్లి పెద్ద కనమలో ఈరోజు ఉదయం ఓ సిమెంట్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. సుమారు 20 అడుగుల లోతులో సిమెంట్ లారీ బోల్తా పడడంతో అందులో ఉన్న డ్రైవర్, క్లీనర్ లు చాకచక్యంగా ప్రాణాలతో బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం నుండి తప్పించుకున్న డ్రైవర్, క్లీనర్ లను జరిగిన ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్ చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. చంద్రగిరి నుండి వెదురు కుప్పం మండలం చవటగుంటకు సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీ ఉదయం 5 గంటలకు అనుపల్లి-బ్రాహ్మణ పల్లి మద్యలో గల పెద్ద కనుమలో ఎదురుగా వస్తున్న టిప్పర్ ను తప్పించబోయి అదుపుతప్పి 20 అడుగుల లోతులో పడిపోయినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్, చాకచక్యంగా తప్పించుకున్నట్లు చెప్పారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాద విషయం తెలుసుకున్న రామచంద్రాపురం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని జరిగిన సంఘటన పై వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital