సింహాచలం, ప్రభన్యూస్): సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంగళవారం ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో శాసనమండలి సభ్యులు సుభాష్ రెడ్డి దంపతులు, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ఎస్ మురళి, విశాఖ జూ క్యూరేటర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి డాక్టర్ నందిని సలేరియా, రాష్ట్ర సమాచార కమిషనర్ రేపాక శ్రీనివాసరావు దంపతులున్నారు.
భారతీయ స్టేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్ గుండురావు ఉన్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అధికారులు స్వాగతం పలకగా మీరు ముందుగా కప్ప స్తంభం వద్ద పూజలు నిర్వహించి బేడా ప్రదర్శనను నిర్వహించారు. అంతరాలయంలో శ్రీ స్వామివారిని దర్శించుకుని గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వీరికి ఆలయ వైదుకులు దీవెనలు అందజేయగా ఆలయ వర్గాలు ప్రసాదమును ఇచ్చి సత్కరించారు.