Monday, November 25, 2024

AP | పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌పై అధికారులకు సీఈసీ దిశానిర్ధేశం

అమరావతి, ఆంధ్రప్రభ : పోస్టల్‌ బ్యాలెట్‌, హోం ఓటింగ్‌కు సంబంధించి అధికారుల బాధ్యతలు వారు నిర్వహించాల్సిన విధులపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా దిశానిర్ధేశం చేశారు. రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్ నిర్వహించారు. వైఎస్సార్‌ జిల్లా ఎన్నికల అధికారి వి విజయ రామరాజు రూపొందించిన ఈ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌లోని పలు అంశాలను ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చించారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ అండ్‌ హోం ఓటింగ్‌కు సంబంధించి ఏప్రిల్‌, మే మాసాల్లో తేదీల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు ఇతర సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాలు కల్పించడం, అందుకు అవసరమైన ఫెసిలిటేషన్‌ సెంటర్ల ఏర్పాటు- తదితర అంశాలను వివరించారు. సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు- అదనపు సీఈవో ఎమ్‌.ఎన్‌. హరెంధిర ప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement