Tuesday, November 26, 2024

AP | కేంద్ర మంత్రి పెమ్మసానిని కలిసిన సిసిఐ సిఎండి..

ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో : పత్తి రైతులకు ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో ప్రొక్యూర్మెంట్ జరగాలని, సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు ఆగకూడద‌ని, మాయిశ్చరైజ్ పర్సంటేజ్ విషయంలోనూ ఒక ఖచ్చితమైన న్యాయం జరగాలని గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ని కాటన్ కమిషన్ ఆఫ్ ఇండియా సి.ఎం.డి లలిత్ కుమార్ గుప్తా ఢిల్లీలోని సంచార భవన్ లో మంగళవారం కలిశారు. గతవారం గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన సిసిఐ సమావేశంలో భాగంగా పత్తి రైతుల సమస్యల పరిష్కారార్థం పెమ్మసాని పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయా సమస్యల గురించి చర్చించే నిమిత్తం సిఎండి పెమ్మసానితో ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ… పత్తి రైతులకు ప్రభుత్వం తరఫున వీలైనంత సహాయం అందించాల్సిందేనని తెలిపారు. ఈ – క్రాప్ తదితర అంశాల్లోనూ ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారం చూపాలని సూచించారు.

పెమ్మసాని ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన అనంతరం సీ.ఎం.డి మాట్లాడుతూ.. రైతుల సమస్యలను ఉద్దేశించి ‘కాటన్ యాలీ’ యాప్ ద్వారా ఒక నూతన పరిష్కారం అందుబాటులోకి తెచ్చామంటూ కేంద్రమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళారు. ఆ యాప్ ద్వారా పత్తి ప్రొక్యూర్మెంట్ ఉత్పత్తి తదితర వివరాలతో పాటు ఆధార్ లింక్, బ్యాంక్ అకౌంట్ అనుసంధానం ద్వారా రైతులకు నగదు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్టు లలిత్ కుమార్ వివరించారు.

అయితే పూర్తిస్థాయిలో ఆ యాప్ ను అందుబాటులోకి తీసుకురావడం వల్ల రైతులకు వీలైనంత త్వరగా న్యాయం చేయొచ్చని తెలిపారు. అలాగే గత వారం సమావేశంలో చెప్పిన ప్రకారం అన్ని కేంద్రాల్లోనూ కొనుగోళ్ళను ప్రారంభించి, వేగవంతం చేసినందుకు ఈ సందర్భంగా సీ.ఎం.డీ లలిత్ కుమార్ గుప్తాకు పెమ్మసాని కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement