విశాఖపట్నం – లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు కాకినాడ కస్టమ్స్ అధికారులు.. కాకినాడకి చెందిన శ్రీ చంద్ర బల్క్ కార్గో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి భరత్ నుంచి రూ.3,18,200 లంచం తీసుకుంటుండగా పోర్టు కస్టమ్స్ సూపరిడెంట్ వై శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు సీబీఐ అధికారులు..
అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. పోర్ట్ అసిస్టెంట్ కమిషనర్, ఇతర కస్టమ్ అధికారుల నుంచి 27.74 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.. మొత్తం పోర్ట్ అధికారుల నుంచి 31 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు సీబీఐ అధికారులు.. ఈ కేసులో మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు ఉన్నట్లు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.. ఇక, విశాఖ సీబీఐ కోర్టులో నిందితులను హాజరుపరచగా రిమాండ్ విధించింది న్యాయస్థానం.. విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని.. దర్యాప్తు కొనసాగుతుందని నేడు విడుదల చేసిన ప్రకటన సిబిఐ ఎస్పీ చెప్పారు..