ఏపీ సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తులో వేగం పెంచిన సీబీఐ అధికారులు.. కేసులో అనుమానితుడు శివశంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శివశంకర్ రెడ్డిని.. సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను హైదరాబాద్ సీబీఐ కార్యాలయానికి తరలించారు.
కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి శివశంకర్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా ఉన్నారు. వైఎస్ వివేకా కారు డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మేరకు శివశంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శివశంకర్‌రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://www.facebook.com/andhraprabhanewsdaily