Saturday, November 23, 2024

వివేకా హత్యకేసులో అవినాష్ కు మూడో సారి నోటీస్

కడప,ప్రభ న్యూస్ బ్యూరో – హత్య కేసులో సిబిఐ మరింత దూకుడు పెంచింది.ఈ కేసులో ఎంపి అవినాష్ రెడ్డికి 3వ సారి సిబిఐ
నోటీసులు జారీ చేసింది. రేపు హైదరాబాద్ సిబిఐ కార్యా లయానికి విచారణకు రావాల ని నోటీసులో పేర్కొంది. పులివెందుల్లోని ఆయన నివా సానికి సిబిఐ అధికారులు వెళ్ళి వెళ్లి నోటీసులు అందజేశారు. 6 వతేది తప్పకుండా హాజరుకా వాలని సిబిఐ కోరింది.
కాగా, ఇప్పటికే అవినాష్ రెడ్డి 2 సార్లు సిబిఐ విచారణను ఎదుర్కొన్నారు.

నిందితుని భార్యకు బెదిరింపులు
వివేకా హత్య కేసులో ఎం 3 నిందితుడుగా ఉన్న ఉమా శంకర్ రెడ్డి సతీమణికి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.ఆమేరకు ఆమె పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తలిసింది..అయితే ఆమె ఫిర్యాదు పై పోలీసులు ఇంకా ఏమి మాట్లాడలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement