Saturday, November 23, 2024

వివేకా హత్యకేసు: మాజీ కారు డ్రైవర్ పై సీబీఐ ప్రశ్నల వర్షం

ఏపీ సీఎం జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు కీలక వ్యక్తలను ప్రశ్నించారు. వివేకా హత్య కేసు ఆరో రోజు సీబీఐ విచారణ కొనసాగుతుంది. కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ కేంద్రంగా విచారణ సాగుతుంది. శనివారం మరోసారి మాజీ కారు డ్రైవర్ దస్తగిరిని సీబీఐ బృందం విచారిస్తుంది. దర్యాప్తులో పలు కీలక అంశాలను అధికారులు రాబట్టినట్లు సమాచారం. నిన్న వివేకా అనుచరుడు సునీల్ కుమార్ యాదవ్ తో పాటు పులివెందులలోని ఒక ఇన్నోవా వాహనం యజమాని మట్కా రవి, డ్రైవర్ గోవర్ధన్ లను సీబీఐ విచారించింది.

కాగా, వివేకా హత్య కేసు కొంత కాలం విరామం తర్వాత జూన్ 7వ తేదీ నుంచి మళ్లీ విచారణ మొదలైంది. కడప జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ జైల్‌లో ఉన్న గెస్ట్‌ హౌస్‌లో ఈ విచారణ జరుగుతోంది. గతంలో పలుమార్లు దర్యాప్తు జరిపినప్పటికీ కీలక ఆధారాలు సంపాదించడంలో విఫలమైన సీబీఐ… ఈసారి పకడ్బందీగా ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement