ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తును సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసు విచారణ 62వ రోజుకు చేరింది. వివేకా కేసులో కస్టడీలోకి తీసుకున్న కీలక నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు పులివెందుల తీసుకువెళ్లారు. వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం సీబీఐ బృందం ఆరా తీసింది. పులివెందులలో సునీల్ సమక్షంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరణాయుధాల కోసం వివేకా ఇంటి సమీపంలోని లోతేటి వాగులో తనిఖీలు చేపట్టారు.
వివేకా హత్యకు ఉపయోగించిన ఆయుధాలేంటి? : సీబీఐ ఆరా
Advertisement
తాజా వార్తలు
Advertisement