కడప – వైెఎస్ వివేకానంద హత్య కేసులో నేటి తెల్లవారుఝామున అరెస్ట్ చేసిన ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి పైన 120b కుట్ర , 302 మర్డర్ , 201 ఆధారాలు చేరిపివేయడం వంటి సెక్షన్ల కింద సిబిఐ కేసు నమోదు చేసింది.. అరెస్ట్ చేసిన వెంటనే భాస్కరరెడ్డిని హైదరాబాద్ కు తరలించారు.. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం భాస్కరరెడ్డిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు.. కాగా, సిబిఐ అభియోగపత్రంలో అనేక కీలకవిషయాలను పేర్కొంది.. వివేకా హత్య తర్వాత , ముందు నిందితులను భాస్కర్ రెడ్డి ఇంటికి పిలిచి మాట్లాడారని వెల్లడించింది.. హత్య కేసులో భాస్కరరెడ్డిది కీలకపాత్ర ఉందని పేర్కొంది.. భాస్కరరెడ్డిపై 120 బి కుట్ర, 302 మర్డర్, 201 ఆధారాలు చెరిపేయడం సెక్షన్ కింద కేసు నమోదు చేశామని సిబిఐ అధికారులు తెలిపారు.. అలాగే భాస్కరరెడ్డి అరెస్ట్ విషయాన్నిఆయన భార్య శ్రీలక్ష్మి, పి. జనార్ధన్ రెడ్డికి సమాచారం అందజేస్తూ ఒక మెమో ఇచ్చారు.. అలాగే బాస్కరరెడ్డికి చెందిన ఫోన్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. ఇది ఇలా ఉంటే ఎంపి అవినాష్ రెడ్డిని హైదరాబాద్ లో సిబిఐ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.. అయితే ఈ విషయాన్ని సిబిఐ ఇంత వరకూ దృవీకరించ లేదు..
భాస్కరరెడ్డిపై కుట్ర, మర్డర్, ఆధారాలు చెరిపేయడం సెక్షన్ ల కింద కేసు నమోదు
Advertisement
తాజా వార్తలు
Advertisement