Friday, November 22, 2024

అక్రమాస్తుల కేసు.. జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ పిటిషన్ ను సీబీఐ కోర్టు వాయిదా వేసింది. పెన్నా కేసులో ప్రధాన నిందితుడైన వైఎస్‌ జగన్‌ దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌లో కౌంటర్‌ దాఖలు చేసేందుకు శుక్రవారం ప్రత్యేక కోర్టును సీబీఐ గడువు కోరింది. దీనికి అనుమతినిస్తూ విచారణను కోర్టు ఈనెల 20కి వాయిదా వేసింది. దీంతోపాటుగా తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, వీడీ రాజగోపాల్‌, శామ్యూల్‌ల డిశ్చార్జి పిటిషన్లపైనా విచారణను వాయిదా వేసింది. పెన్నా కేసుతోపాటుగా రఘురాం,భారతీ సిమెంట్స్‌ కేసులనూ ఈనెల 20కి వాయిదా వేసింది. ఇండియా సిమెంట్స్‌ కేసులోనూ డిశ్చార్జి పిటిషన్‌ దాఖలు చేస్తామని జగన్‌తో పాటు విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్‌, కార్మెల్‌, ఏసియా హోల్డింగ్‌ లిమిటెడ్‌ల తరఫు న్యాయవాది నవీన్‌కుమార్‌ కోరడంతో విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

మరోవైపు జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో రెండో నిందితుడైన విజయసాయిరెడ్డి బెయిలు రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పైన సీబీఐ కోర్టు నిన్న విచారించింది. కేసులోని అంశాల ఆధారంగా కోర్టు నిర్ణయం తీసుకోవాలని కోరుతూ సీబీఐ మెమో దాఖలు చేశారు. అయితే కౌంటర్‌ దాఖలుకు గడువు కావాలని విజయసాయిరెడ్డి తరఫు న్యాయవాది అభ్యర్థించడంతో విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement