సీఎం జగన్‌కు సీబీఐ స్పెషల్ కోర్టు భారీ ఊరట కల్పించింది. సీఎం జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈనెల 17వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు కుటుంబంతో కలిసి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లేందుకు పర్మిషన్ ఇస్తూ నాంపల్లి సీబీఐ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాలకు వెళ్లేందుకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది.
విదేశీ పర్యటనకు వెళ్లే ముందు వ్యక్తిగత ఫోన్ నంబర్, జీ మెయిల్ వివరాలు కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని జగన్‌ను కోర్టు ఆదేశించింది. కాగా, అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న సీఎం జగన్.. విదేశీ పర్యటనకు వెళ్లేందుకు బెయిల్ షరతులు సడలించి అనుమతి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. తాజాగా ఇవాళ పై తీర్పు వెలువరించింది.
- Advertisement -