కడప, ప్రభన్యూస్ బ్యూరో : మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టి వేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కడప కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఉమాశంకర్ రెడ్డి బెయిల్ కోసం పిటిషన్ వేసిన నేపధ్యంలో సీబీఐ ఆయనకు బెయిల్ ఇవ్వద్దని కోరింది. వివేకా హత్యకేసు ధర్యాప్తు కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపించింది. వాదనలు విన్న కోర్టు విచారణను ఈనెల 14కు వాయిదా వేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement