అమరావతి, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఏమిటన్నది సీబిఐ ఇప్పటికే ఓ నిర్ధారణకు వచ్చింది. అవినాష్ రెడ్డిని ఇప్పటికి ఐదు సార్లు విచారించగా ఆయన ముందస్తు బెయిల్‌పై తెలంగాణా హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపధ్యంలో ఎంపీ ప్రయత్నాల న్నీ బెడిసికొట్టినటై ్లంది. ఇరు పక్షాల వాదనలు వినేందుకు జూన్ 5వ తేదీకి తెలంగాణా హైకోర్టు వాయిదా వేసింది. ఆ సమయంలో అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో కౌంటర్ వేసిన సీబీఐ వివేకా హత్య కేసులో అవినాష్ పాత్రను స్పష్టం చేసింది. అవినాష్‌ను అరెస్టు చేసి విచారించాల్సిన అవసరాన్ని కౌంటర్ పిటిషన్‌లో కోర్టు దృష్టికి తీసుకువచ్చింది. వివేకా హత్య కేసు దర్యాప్తుపై కీలక వివరాలు వెల్లడించింది. అవినాష్‌ను అరెస్ట్ చేసి కస్టడీలో ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడి న సీబి ఐ అవినాష్‌రెడ్డి దురుద్దేశపూరితంగానే దర్యాప్తునకు సహకరించట్లేదని, విచారణలో వాస్తవాలు దాచిపెడుతూ సమాధానాలు దాటవేస్తున్నారని, విచారణ నుంచి తప్పించుకునేందుకే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లుగా పేర్కొంది. అవినాష్‌రెడ్డికి నేరచరిత్ర ఉందన్న సీబిఐ ఇప్పటికే ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులున్నాయని పేర్కొంది. ఈ కేసులో వివేకా హత్యకు కుట్ర, హత్య అనంతరం సాక్ష్యాలు చెరిపేయడంలో ఎంపీ పాత్ర ఉందని కౌంటర్ పిటిషన్‌లో ఆరోపించింది. ఆయన కేసు దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని పేర్కొంది. ఘటన స్దలంలో సాక్ష్యాలు చెరిపివేయడమంటే అది కుట్రలో భాగమేనని, అదేవిధం గా ఆయన సాక్షులను ప్రభావితం చేస్తున్నారని కోర్టుకు తెలిపింది. అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు సాక్షులు వెనుకడుగు వేస్తున్నారని, ఆయన అనుచరుల వైఖరితో కేసు దర్యాప్తుకు ఆటకం ఏర్పడుతోందని తెలియచేసింది. ఈ కేసులో కృష్ణారెడ్డి, సీఐ శంకరయ్య, గంగాధర్‌రెడ్డి తదితరులపై అవినాష్ ప్రభావం తీవ్రంగా ఉందని, మరోవైపు ఇటీవల అవినాష్ తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్టు తర్వాత ప్రదర్శనలు జరగటం సాక్షులను ప్రభావితం చేయడమేనని సీబి ఐ కోర్టుకు తెలియచేసింది.
తేల్చాల్సినవి చాలా ఉన్నాయి..
కాగా వివేకా హత్యకు సంబంధించి ఇంకా అనేక కీలకమైన అంశాలు దర్యాప్తులో తేలాల్సి ఉందని, వాటికి సంబంధించి అవినాష్ నుంచి సమాచారం రాబట్టాల్సిన అవసరాన్ని సీబిఐ కౌంటర్‌లో కోర్టుకు స్పష్టం చేసింది. ముఖ్యంగా హత్యకు ఉపయోగించిన గొడ్డలి ఎక్కడుందో తెలియాలని పేర్కొంది. ఎక్కడ కొనుగోలు చేశారన్న విషయం దర్యాప్తులో వెల్లడైనప్పటికీ హత్య అనంతరం ఎక్కడ దాచిపెట్టారన్నది అవినాష్ కస్టడీ విచారణలో రాబట్టాల్సి ఉందని తెలిపింది. అదేవిధంగా హత్యకు 4 కోట్లు డీల్ కుదిరిందన్న విషయం వెలుగు చూసిన నేపధ్యంలో అందుకు సంబంధించిన లావాదేవీలు అవినాష్ విచారణలోనే తేల్చాల్సి ఉందని, ఆ నాలుగు కోట్లు ఎక్కడి నుంచి తీసుకువస్తారు, ఎవరు ఫండింగ్ చేస్తారో తెలియాల్సి ఉందని, నేరాన్ని తనపై వేసుకుంటే రూ.10 కోట్లు- ఇస్తామన్నారని విచారణలో చెప్పిన గంగాధర్‌రెడ్డి మాటల్లో నిజమెంతో తేల్చాల్సి ఉంద ని చెప్పింది. నిందితుడు సునీల్ యాదవ్‌తో అవినాష్ రెడ్డికి ఉన్న సంబంధాలు, వివేకా హత్య జరిగిన రోజు సునీల్ అవినాష్ రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్ళాడు.. మార్చి 15వ తేదీన అవినాష్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు, హత్య కుట్రలో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది, ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని ఓబుల్ రెడ్డి, భరత్ యాదవ్ ఎందుకు కలిశారు వంటి కీలక అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం రాబట్టాల్సి ఉన్నందున అవినాష్‌ను కస్టడీకి తీసుకుని విచారించాల్సిన అవసరాన్ని సీబిఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌లో కోర్టు దృష్టికి తీసుకువచింది