Friday, November 22, 2024

అవినాష్ ను లొంగి పొమ్మని చెప్పండి – ఎస్పీ తో సీబీఐ

కడప ఎంపీ అవినాష్ రెడ్డి, సిబిఐ మధ్య నెలకొన్న సందిగ్ధం నేపథ్యంలో కర్నూల్ లో హై టెన్షన్ నెలకొంది. అవినాష్ రెడ్డి ని సిబిఐ బృందం అరెస్టు చేయనుందని ప్రచారం నెలకొన్న నేపథ్యంలో కర్నూల్ విశ్వభారతి హాస్పిటల్ వద్ద తీ వ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే సీబీఐ బృందం కర్నూల్ కు చేరుకుంది సిబిఐ అధికారులు స్థానిక టూటౌన్ పోలీస్ స్టేషన్లో మకాం వేశారు. మరోవైపు కర్నూలు విశ్వ భారతి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది.ఆసుపత్రి దగ్గరలో అవినాష్ రెడ్డి అనుచరులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద నుంచి మెయిన్ రోడ్డు వరకు బారికేడ్లను పోలీసులు ఏర్పాటు చేశారు.ఎవరిని కూడా ఆ వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. వాస్తవంగా గత మూడు రోజుల క్రితం మే 22న విచారణకు రావాలని అవినాష్ రెడ్డి కి సిబిఐ నోటీసులు ఇచ్చింది. అయితే
అవినాష్ తల్లి శ్రీలక్ష్మి కి ఆరోగ్యం బాలేదని పది రోజులు గడువు అడిగారు అవినాష్ రెడ్డి. ఈవిషయంలో సిబిఐ తిరస్కరించి కచ్చితంగా విచారణకు రావాల్సిందే అని తెలిపింది. ఈక్రమంలో అవినాష్ పంపిన లేఖను తిరస్కరించి అరెస్టుకు రంగం సిద్దం చేసింది.ఇప్పటికే సిబిఐ అధికారులు.కర్నూల్ ఎస్పీ ని కలిశారు.అరెస్ట్ విశయం ఆయనకు వివరించారు. అనంతరం ఆస్పత్రి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు.
సిబిఐ అధికారులు కూడా విశ్వ భారతి ఆస్పత్రికి చేరుకున్నారు. ఈక్రమంలో అప్రాంతంలో కరెంటు సరఫరా నిలిపివేసారు.ఇక ఆసుపత్రిలోని కార్డ్ రూములో అవినాష్ రెడ్డి ఒంటరిగా ఉన్నట్లు సమాచారం.దీంతో
కర్నూల్ లో ఏం జరగబోతుంది..ఆన్న టెన్షన్ ప్రజలో నెలకొంది.

ఇది ఇలా ఉంటే కర్నూలు ఎస్పీ కృష్ణకాంత్‌తో సీబీఐ అధికారుల చర్చలు జరిపారు. అవినాష్‌రెడ్డిని లొంగిపోవాలని చెప్పాలని ఎస్పీ నీ సీబీఐ అధికారులు కోరారు శాంతిభద్రతల దృష్ట్యా ఎస్పీతో సీబీఐ అధికారుల చర్చలు జరుగుతున్నాయి. కర్నూలులో శాంతిభద్రతల సమస్య లేకుండా చూడాలని సూచన చేసారు. రెండు వాహనాల్లో వేకువజామునే కర్నూలు కు సీబీఐ అధికారులు చేరుకొన్నారు .

Advertisement

తాజా వార్తలు

Advertisement