Thursday, December 19, 2024

AP | ఉచ్చులో చిక్కి.. చిరుత మృతి

  • కృష్ణా జిల్లాలో కలకలం
  • మెట్లపల్లిలో అటవీశాఖ అధికారుల దర్యాప్తు
  • భ‌యాందోళ‌న‌లో గ్రామీణ ప్ర‌జ‌లు


ఆంధ్రప్రభ స్మార్ట్, గన్నవరం : కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో అడవి పందుల కోసం పెట్టిన‌ ఉచ్చులో చిక్కి ఓ చిరుత మృతి చెందింది. ఈ సమాచారం కలకలం సృష్టించగా.. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలిని ప‌రిశీలించారు. పూర్తి దర్యాప్తు ప్రారంభించారు. మెట్లపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన పంట పొలాన్ని పందుల నుంచి రక్షించుకునేందుకు పెట్టిన ఉచ్చులో చిక్కి చిరుత పులి చనిపోయింది.

పొలానికి వెళ్లి చూడ‌గా..
ఆ రైతు గురువారం ఉదయాన్నే పొలానికి వ‌చ్చి చూడ‌గా చిరుతపులి క‌నిపించింది. దీంతో భ‌యంతో ప‌రుగులు తీశాడు. అయితే అది ఎంతకీ క‌ద‌ల‌క‌పోవ‌డంతో దగ్గరకు వెళ్లి చూశాడు. ఆ చిరుత చ‌నిపోయింద‌న్న విషయాన్ని గుర్తించాడు. విష‌యాన్ని గ్రామస్థులకు తెలిపాడు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు.

చిరుత మృతదేహాన్ని ప‌రిశీలించిన అధికారులు అది చనిపోయి రెండు రోజులు కావొస్తోందని అనుమానిస్తున్నారు. చిరుతపులి ఎక్కడి నుంచి వచ్చింది. దీంతో పాటు మరిన్ని చిరుతలు ఉన్నాయా? అనే కోణంలో అటవీశాఖ అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనతో మెట్లపల్లి సమీపంలోని గ్రామాల ప్రజలు భయంతో గజ గజలాడుతున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement