ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో దశ పశువుల అంబులెన్సులు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా పథకం కింద అంబులెన్సులను సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. సుమారు రూ.240 కోట్లతో 340 పశువుల అంబులెన్సులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే మొదటి దశలో రూ.129 కోట్లతో 175 అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొచ్చారు. రెండో దశలో రూ.112.62 కోట్లతో మరో 165 పశువుల అంబులెన్సులు ప్రారంభించారు. పశువుల ఆరోగ్యానికి సైతం ఏపీ ప్రభుత్వం భద్రత, భరోసా కల్పిస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement