Monday, November 25, 2024

కొర్ర‌ మేను ముసుగులో క్యాట్ ఫిష్ అమ్మ‌కాలు…

అమరావతి,ఆంధ్రప్రభ: క్యాట్‌ ఫిష్‌ పేరు వింటేనే వణుకు పుడుతుంది.. కొర మేను అంటే మేలురకం, మంచి రుచి, డిమాండు ఉన్న చేప. మరి అంత ఖరీదైన చేప ను మార్కెట్‌లో డిమాండుకు తగిన విధంగా విక్రయాలు జరిపి సొమ్ము చేసు కోవాలంటే కుదరని పని. అందుకే కొరమేను పేరుతో మార్కెట్‌లో అమ్మడవుతోంది క్యాట్‌ ఫిష్‌. కొరమేను, క్యాట్‌ఫిష్‌ అటు ఇటుగా కొద్దిపాటి తేడా ఉంటుంది కనుక జనం పోల్చుకోలేరు. ఇక కొన్ని హోటళ్ళు, రెస్టారెంట్లలో కొరమేను డిష్‌పేరుతో వడ్డించేది క్యాట్‌ఫిష్‌ మాత్రం కాదు అని చెప్పలేం. అందుకే చాలామంది కొరమేను మోజులో క్యాట్‌ఫిష్‌ తినేసి తీవ్ర అనారోగ్యపాలై ఆస్పత్రుల చుట్టూ తిరుగుతు న్నారు. కొందరైతే దీర్ఘకాలిక రోగాలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక అక్రమార్జనకు అలవాటు పడిన వ్యాపారులు యదేశ్ఛగా చెరువులు, కుంటలు, క్వారీల గోతులు, మురుగు తటాకాల్లో గుట్టు చప్పుడు కాకుండా పెంచుతున్నారు. అతి తక్కువ రోజుల్లో అధిక దిగుమతి కలిగిన క్యాట్‌ఫిష్‌ను మారె ్కట్‌కు తరలించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. కుళ్లిన వ్యర్థాలే ఆహారం..చేపలు తింటే మంచిదని నిపుణులు చెబుతారు. నదులు, సముద్రాల్లో చేపలు నీటిలో ఉండే నాచు, చిన్న చిన్న చేపల్ని తిని పెరుగుతాయి. ఇక చెరువుల్లో వీటి పెంపకదార్లు ప్రత్యేక ఆహారం వేసి పెంచుతారు. కానీ క్యాట్‌ ఫిష్‌లు మాత్రం కుళ్లిపోయిన కళేబరాలు, వ్యర్థాలు తిని పెరుగుతాయి. అంతేకాదు క్యాట్‌ ఫిష్‌లు పెంచే చెరువుల్లో పెంపక దారులు కోళ్ళ ప్రేగులు, మాంసం వ్యర్ధాలు వేసి పోషిస్తారు. ఆయా చెరువుల్లో పడి చనిపోయిన జంతు, జీవరాసులు వీటికి ఆహారమవుతాయి. బతికున్న జీవులు మనుషులను సైతం క్యాట్‌ఫిష్‌లు కొరికి చంపి తినేస్తాయంటే అనుమానమే లేదు. రాకాసి చేపలుగా పిలువబడే రాక్షస జాతికి చెందిన క్యాట్‌ఫిష్‌లు మంచినీటిలో కన్నా మురుగునీరు, కాలుష్య నీటి కాసారాల్లో ఏపుగా పెరుగుతాయి. ఈ క్యాట్‌ ఫిష్‌ల పెంపకానికి ఖర్చు పెద్దగా ఉండదు. పైగా త్వరగా, భారీ సైజులో పెరిగే ఈ చేపల పెంపకానికి కష్టపడనక్కరలేదు.


దొంగచాటు పెంపకం.. అక్రమ రవాణా..
కొరమీనుకు మీసాలుండవు. క్యాట్‌ ఫిష్‌కు పెద్ద మీసాలుంటాయి. ఇక రెండూ నల్లగా జిగురుగా ఉంటాయి. దీంతో వ్యాపారులు మీసాలు తీసేసి కొరమీను పేరుతో అమ్మేస్తారు. కొర్రమీనుకు, క్యాట్‌ ఫిష్‌కు తేడాలు తెలియనివారు దాన్నే కొరమీను అనుకుని కొనేస్తుంటారు. ఇదీ మార్కెట్‌లో నిత్యం జరిగే మోసం. అటు- రహస్య పెంపకాలు, ఇటు- మోసాల అమ్మకాలతో క్యాట్‌ ఫిష్‌ల దందా కొనసాగుతూనే ఉంది. ఎక్కువగా కొల్లేరు, గోదారి జిల్లాల్లో కొందరు అక్రమదారులు క్యాట్‌ఫిష్‌ను యదే శ్చ్చగా పెంచుతున్నారు. అయితే ఇటీవల కాలంలో అక్కడ పోలీసులు, సంబంధిత శాఖల అధికారుల నిఘా ఎక్కువ కావడంతో రూటుమార్చిన అక్రమార్కులు ప్రకా శం జిల్లాకు మకాం మార్చారు. ప్రకాశం, గుంటూరు, బాపట్ల, నెల్లూరు తదితర జిల్లాల్లో క్వారీలు మైనింగ్‌, అటవీ ప్రాంతాలు ఉన్నందున చిన్న చిన్న చెరువులు, క్వారీ గోతులు, మురిగిపోయిన పచ్చబడిన తటాకాలను పెంపకానికి అనువుగా చేసుకుంటున్నారు. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తూ హోట ళ్ళు, రస్టారెంట్లకు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడు, ఒరిస్సా, కర్నాటక, తెలంగాణా ఉత్తరాది రాష్ట్రాలకు చేరవేస్తున్నారు. అనేక సందర్భాల్లో పోలీసులు, అధికారులు అక్రమ రవాణా అవుతున్న క్యాట్‌ఫిష్‌ వాహనాలను పట్టుకున్నారు.


డెడ్లీ ఫిష్‌పై నిషేధం..
డెడ్లీ ఫిష్‌గా పిలువబడే క్యాట్‌ ఫిష్‌ల పెంపకంపై నిషేధం ఉంది. అయినా పలు ప్రాంతాల్లో రహస్యంగా పెంచుతున్నారు. భారత్‌లో క్యాట్‌ ఫిష్‌ల పెంపకాలతో పాటు అమ్మడాన్ని కూడా నిషేధించారు. ఈమేరకు సుప్రీంకోర్టు కూడా నిషేధిం చాలని ఎప్పుడో ఆదేశించింది. ఈ ఫిష్‌ను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో నిషేదిత జాబితా లో చేర్చింది. గతంలో చాటు-మాటు-గా జరిగే పెంపకాలు ఇప్పుడు కొందరు అక్రమా ర్కులు దర్జాగా చేపల చెరువుల పేరుతో వీటిని పెంచుతున్నారు. కుళ్ళిన మాంసమే ప్రధాన ఆహరంగా పెరిగే ఈ క్యాట్‌ ఫిష్‌ కేవలం ఆరునెలల్లోనే 20 కేజీల బరువు వరకు పెరుగుతుంది. ఈ చేపల పెంపకంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement