అమరావతి,ఆంధ్రప్రభ: రాష్ట్ర రాజకీయాల్లో ఆది నుండి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలుస్తున్న కాపు సామాజికవర్గం జన సేనాని వారహి యాత్ర సందర్భంగా మరోసారి వార్తల్లోకె క్కింది. వపన్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ కాపు ఉద్యమ నేత ముద్ర గడ పద్మనాభం రాసిన లేఖ రాజకీయ దుమారానికి తెరలేపింది. దీనిపై అటు తెలుగు దేశం ఒక లేఖాస్త్రాన్ని సంధించడం, కాపు సంఘాలు లేఖలు విడుదల చేయడం వెరసి ఇది రాజకీయ రంగు పులుకుంది. దీనిపై పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు, టీవీల్లో డిబేట్లతో మారు మోగింది. ఈక్రమంలోనే ముద్రగడ జనసేనానికి మరో లేఖ రాశా రు. దీంతో ఈ దుమారం మరింత రాజుకుంది. చివరికి ఎవరేం చేశారో తెలుసంటే తెలుసనే పరిస్థితికి రావడం, చనిపోయిన వ్యక్తుల పేర్లను ఉటంకించడం ఇలా పలు రకాలుగా చర్చలకు దారితీసింది. ఇప్పుడిది కాపు సామాజికవర్గ పెద్దలకు రుచిం చడం లేదు. ఎంతో గౌరవంగా, ఉన్నతంగా ఉండే తమ జాతి పరువును బజారు కీడుస్తున్నారన్న భావన వారిలో వ్యక్తమవుతోంది. రాజకీయాల్లోకి వచ్చిన తమ సామాజికవర్గ నేతలు తమ సామాజికవర్గ అభివృద్ధికి కృషిచేయాలేతప్ప కులాన్ని రోడ్డుమీదకు తీసుకురావడం సరికాదంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. నిజంగా కాపు నేతలకు కాపుల పట్ల చిత్తశుద్ధి, అంకిత భావం ఉంటే రిజర్వేషన్లు సాధించి జాతికి అంకితమివ్వాలని వారు కోరుతున్నారు. ఎవరేపార్టీలోఉన్నా కాపు జాతికి ఉపయోగపడేలా పనిచేయాలని సూచిస్తున్నారు. ఈక్రమంలోనే అధికార పార్టీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఈ రచ్చకు అందరూ ఫుల్‌స్టాప్ పెట్టాలంటూ విజ్ఞ ప్తులు చేస్తున్నారు. ఇప్పుడిది రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాం శంగా మారింది.
పార్టీలకంటే కులం ముఖ్యం
కాపులు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఉన్నారని, అయితే వీరంతా కుల అభివృద్ధికి కృషి చేస్తే బాగుంటుందని కాపు కుల పెద్దలు చెప్పుకొస్తున్నా రు. ఆర్ధికంగా స్థిరపడి రాజకీయాలకు దూరంగా ఉంటూ కుల సంఘాలకు, కులంలోని నిరుపేదలకు చేయూతనందిస్తూ బయటకు రాని ఎంతో మంది కాపు పెద్దలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులను జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. కాపులు రాజకీయంగా వృద్ధిలోకి రావాలన్న కోరిక తమకు కూడా ఉందని, కానీ, కాపు కులస్థులే ఒకరికొకరు ఇలా వర్గాలుగా విడిపోయి నిందించుకోవడంపట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రాజకీయాలకంటే కులమే ముఖ్యమని, తమ కులంలో ఎంతో మంది వెనుకబడిన వారు ఉన్నారని వారికి చేయూతనందించే అంశంపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. ఏపార్టీలో ఉన్నా కాపు నేతలంతా ఈ కోణంలో ఆలోచించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
రిజర్వేషన్ల అంశంపై పోరాటం చేయాలి
ఇదిలా ఉండగా కాపు సంఘంలోని పెద్దలంతా కాపులకు రిజర్వేషన్ సాధించే అంశంలో ఏకతాటిపైకి రావాలని పిలుపునిస్తున్నారు. ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో కాపుల సమస్యలపై చర్చ ఈస్థాయిలో జరిగిన పరిస్థితి ఎప్పుడూ లేదని, ఇది శుభ పరిణామమే అయినప్పటికీ జాతిలో నిందారోపణలు చేసుకోవడం తమ మనోభావాలను గాయపరుస్తోందంటూ కుల పెద్దలు కొంత మంది ఆవేదన వెలిబుచ్చుతున్నారు. రిజర్వేషన్లు సాధించం ద్వారా నిరుపేదలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు వస్తాయని, అదేవిధంగా రాజీకయాల్లోనూ ఇప్పటికంటే మెరుగైన కేటాయింపులు దక్కుతాయని వారు పేర్కొంటున్నారు. ఆదిశగా కాపుల ఉద్యమ కార్యాచరణ ఉంటే బాగుంటుందని వారు సూచిస్తున్నారు.
రంగంలోకి త్రిమూర్తులు
వీటన్నింటి నడుమ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తోట త్రిమూ ర్తులు కాపులు ఈ మాటల యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటూ మీడి యాముందుకొచ్చారు. పదిమందిలో పలుచన అవుతున్నామన్న భావన నేతలందరూ గుర్తించాలంటూ కోరారు. అయితే, దీనిపై కాపు నాయకులు ఇప్పటి వరకూ స్పందించలేదు. ముద్రగడ పద్మనాభాన్ని అధికార వైకాపా సొంతం చేసుకుని మాట్లాడిస్తుం దంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా త్రిమూర్తులు స్పందించారు. ఎవరూ ఎవరినీ ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆయన ఒక ఎ మ్మెల్యే, మంత్రిగా పనిచేసిన వ్యక్తని గుర్తుచేశారు. ఇలా అపార్ధాలు చేసు కోవడం ద్వారా కాపు జాతి ఉద్యమం దారి తప్పుతోందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయాలు పక్కనబెట్టి కాపు జాతి సమస్యల పరిష్కారానికి, హక్కులు రాబట్టుకోవడానికి పోరాటం చేస్తే బాగుంటుందంటూ హితవు పలికారు.
సంయమనం పాటిస్తేనే
పవన్ కళ్యాన్ ఒక రాజకీయ పార్టీకి అధినేత కాబట్టి ఆయన వరకూ మినహా యింపునివ్వాలని, ఆదే క్రమంలో మిగిలిన కాపు సంఘాల నేతలు, కాపు పెద్దలు ఈ అంశంలో సంయమనం పాటిస్తే బాగుంటుందని కాపు పెద్దలు సూచన చేస్తున్నారు. రాజకీయాలు వేరు, కుల సంఘాలు వేరని చెబుతున్న వారు రాజకీయాల ద్వారానే కుల సంఘాలు తమ తమ హక్కులను కాపాడుకోవడం, సాధించుకోవడం చేయ వచ్చని సూచిస్తున్నారు. అందుకోసం అందరూ ఐక్యంగా ఉండాలని, పార్టీలకతీతం గా కుల ప్రాతిపదికన పనిచేయాలని వారు కోరుతున్నారు. ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో స్టాండ్ ఉంటుందని, వాటిని అందరూ కలిసి కూర్చొని ఒకే ఎజెండాగా మా ర్చాలని వారు సూచిస్తున్నారు. ఆదిశగా అన్నిపార్టీల్లోని కాపు నేతలు కూర్చుని మా ట్లాడుకుని కాపు సంఘాలను తమతో కలుపుకెళ్లాలని, రాజకీయాలకు తావివ్వొద్దని వారు కోరుతున్నారు. ఆదిశగా ప్రయత్నాలు కాపు నేతలు చేస్తాని ఆశిద్దాం. ఈ ఆరోప ణలు, ప్రత్యారోపణలకు ఫుల్ స్టాప్ పెట్టి కుల ఐక్యతకు కృషిచేయాలని కోరుకుందాం.