Tuesday, November 26, 2024

నారాయణపై పలు సెక్షన్ల కింద కేసులు… అవి ఏంటంటే…

నారాయణ విద్యాసంస్థల అధినేత, టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌ను అరెస్ట్ చేసిన వ్య‌వ‌హారంపై చిత్తూరు పోలీసులు స్పందించారు. నారాయ‌ణ‌ను అరెస్ట్ చేసిన మాట వాస్త‌వ‌మేన‌ని పోలీసులు తెలిపారు. హైద‌రాబాద్‌లో ఈరోజు ఉద‌యం 10.30 గంట‌ల‌కు ఆయ‌న‌ను అరెస్ట్ చేశామ‌ని తెలిపారు. అనంత‌రం ఆయ‌న‌ను చిత్తూరు త‌ర‌లిస్తున్నామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా నారాయ‌ణ‌పై న‌మోదు చేసిన కేసుల వివ‌రాల‌ను చిత్తూరు పోలీసులు వెల్ల‌డించారు. ప‌బ్లిక్ ఎగ్జామ్స్ ప్రివెన్ష‌న్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ చ‌ట్టం కింద, ఐపీసీ సెక్ష‌న్లు 408,409, 201,120(బీ),తో పాటు 65 ఐటీ చ‌ట్టం కింద ఆయనపై కేసు న‌మోదు చేసినట్లు తెలిపారు. ఇక ప‌బ్లిక్ ఎగ్జామ్ చ‌ట్టంలోని సెక్ష‌న్లు 5, 8, 10 కింద కూడా నారాయ‌ణ‌పై కేసులు న‌మోదు చేసినట్లు తెలిపారు. అయితే ఈరోజు నారాయ‌ణ‌ను అక్కడి జ్యూడీషియ‌ల్ కోర్టులో హాజ‌రుప‌రుస్తామ‌ని చిత్తూరు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement