Sunday, November 17, 2024

AP: బాలినేని గ్యాంగ్‌పై కేసు నమోదు చేయాలి: నారా లోకేశ్‌

అమరావతి: బాలినేని గ్యాంగ్‌పై ఎన్నికల అధికారులు కేసు నమోదు చేయాలని నారా లోకేశ్‌ డిమాండ్‌ చేశారు. వైకాపాను దారుణ పరాజయ భయం వెంటాడుతోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా విమర్శించారు. ఆ పార్టీ మూక ఓ వైపు ఫేక్ ప్రచారాలు, మరోవైపు దాడులకు తెగబడుతోందని ఆరోపించారు.

ఒంగోలులో తెదేపా అభిమానులపై దాడి దుర్మార్గపు చర్య అన్నారు. సమతానగర్‌ కాలనీవాసులపై మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గ్యాంగ్‌ దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమాలను ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పే ధైర్యం లేకే పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలని కూడా చూడకుండా దాడులకు తెగబడుతున్నారన్నారు.

జ్యోతిరావు పూలేకు నివాళుల‌ర్పించిన నారా లోకేష్ …
మహనీయుడు జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి టీడీపీ నేత నారా లోకేష్ పూలమాల వేసి నివాళులర్పించారు. అణ‌గారిన‌వ‌ర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే జ‌యంతి సంద‌ర్భంగా ఆ మ‌హ‌నీయుని స్మృతిలో నివాళులు అర్పిస్తున్నట్లు లోకేష్ తెలిపారు. మ‌హిళ‌లు, అట్ట‌డుగువ‌ర్గాల ఆత్మ‌గౌర‌వ పోరాటానికి విద్య‌నే ఆయుధంగా అందించిన పూలే మ‌హాశ‌యుని ఆశ‌యసాధ‌న‌కి కృషి చేయ‌డం మ‌నంద‌రి బాధ్య‌త‌. జై పూలే అంటూ లోకేష్ నివాళి అర్పించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement