Wednesday, January 22, 2025

Kakani : వైసీపీ నేత కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డిపై కేసు నమోదు!

ఏపీలో మరో మాజీ మంత్రిపై పోలీస్ కేసు నమోదు చేశారు. ఇటీవల టీడీపీ, వైసీపీ నేతల మధ్య బోగోలు మండలం కోళ్ల దీన్నేలో ఘర్షణ చోటు చేసుకుంది. కాగా ఘర్షణ‌లో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. అనంతరం దాడిలో గాయపడిన వారిని టీడీపీ, వైసీపీ ఒకే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా చికిత్స అనంతరం వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తమ పార్టీ నేతలను పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లాడు.

ఈ క్రమంలో పోలీసులతో ఆయన అనుచితంగా ప్రవర్తించాడు. కొద్దిరోజుల్లో మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. అప్పుడు ఈ పోలీసు అధికారులు ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి బట్టలూడదీస్తామంటూ మాజీ మంత్రి కాకాణి అనూహ్య వ్యాఖ్యలు. అలాగే టీడీపీ నేతలను, కార్యకర్తలను ఎవ్వరిని వదిలే ప్రసక్తే లేదని.. బహిరంగంగా వార్నింగ్ ఇచ్చాడు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత వంటేరు ప్రసన్న కావలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు 224, 351/2, 352, 353/2 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement