Saturday, November 9, 2024

AP | మదనపల్లి ఘటనలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు…

ఇటీవల మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైలు దగ్ధమైన కేసులో ఈరోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిన్న నవాజ్ బాషాకు.. ఈరోజు కేసు నమోదు చేశారు.

దేవాదాయ శాఖకు చెందిన ఫైళ్లు నవాజ్ బాషా వద్ద ఉన్నాయని, అందుకే అతనిపై కేసు నమోదు చేశామని డీఐజీ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ ఘటనపై ఇప్పటి వరకు 8 కేసులు నమోదు చేశామని, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి నివాసంలో 500 ఫైళ్లు లభ్యమయ్యాయని…. పెద్దిరెడ్డి పీఏలు శశిధర్, తుకారాం నివాసాల్లోనూ పలు ముఖ్యమైన ఫైళ్లు దొరికాయని డీఐజీ ప్రవీణ్ కుమార్ వివరించారు. బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే భూ ఆక్రమణదారులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement