ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిపై మరో రెండు కేసులు నమోదయ్యాయి. కరోనాపై లేనిపోని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ న్యాయవాదులు చేసిన ఫిర్యాదుపై గుంటూరు, నరసరావుపేట పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో ప్రమాదకరమైన ఎన్440కే రకం వేరియంట్ వెలుగుచూసిందని, ఇది సాధారణ వైరస్ కంటే 10-15 రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో మానసిక వేదన, అధైర్యం కల్పించాయని పేర్కొంటూ… జిల్లా కోర్టు న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ చేసిన ఫిర్యాదు మేరకు గుంటూరులోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో నిన్న కేసు నమోదైంది. సెక్షన్ 188, 505(1)B0 (2) ఐపీసీ 54 కింద కేసులు నమోదు చేశారు.
ఇక నరసరావుపేటలోనూ చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. చంద్రబాబు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కలిసి కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పట్టణానికి చెందిన న్యాయవాది రాపోలు శ్రీనివాసరావు చేసిన ఫిర్యాదుపై నిన్న చంద్రబాబు, అచ్చెన్నలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాగా, ఈ అంశంమై ఇటీవల కర్నూలు జిల్లాలో చంద్రబాబుపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: కరోనా రాదని ఆవుపేడ పూసుకుంటున్నారు.. కానీ ఇలా చేస్తే ప్రమాదం అంట