ఏపీ సీఎం జగన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో కంపెనీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హెటిరోపై దాఖలైన కేసును కొట్టివేయడానికి న్యాయస్థానం నిరాకరించింది. జగన్ అక్రమాస్తులకు సంబంధించిన కేసు ప్రస్తుతం సీబీఐ కోర్టులో నడుస్తోందని, ఈ కేసును సీబీఐ దాఖలు చేసినప్పుడు హెటిరో కంపెనీని కూడా సీబీఐ పక్కాగానే చార్జ్‌షీట్ దాఖలు చేసిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇవన్నీ దాచేస్తే దాగని నిజాలని ధర్మాసనం పేర్కొంది. జగన్ అక్రమాస్తుల కేసులో.. హెటిరో కంపెనీ విచారణను ఎదుర్కోవాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement