Saturday, November 23, 2024

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబంపై కేసు

టీడీపీ ఎంపీ, అమరరాజా సంస్థల అధినేత గల్లా జయదేవ్‌ కుటుంబంపై కేసు నమోదు అయింది. అమరరాజా సంస్థల భూ ఆక్రమణలపై కోర్టు ఆదేశాల మేరకు ఎంపీ గల్లా జయదేవ్‌తోపాటు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, గల్లా రామచంద్రనాయుడు సహా 12 మందిపై కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లా తవణంపల్లె పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

తవణంపల్లి మండలం దిగువమాగం గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తి తన పొలాన్ని గల్లా కుటుంబం రాజన్న ట్రస్ట్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో భూ ఆక్రమణలకు పాల్పడిందంటూ రైతు కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ జరిపిన చిత్తూరు నాలుగో అదనపు కోర్టు వారిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.

గల్లా అరుణకుమారి తండ్రి దివంగత రాజగోపాల్‌నాయుడు పేరిట ఏర్పాటు చేసిన రాజన్న ట్రస్ట్, ఎడ్యుకేషన్‌ సొసైటీల కోసం దిగువమాఘం గ్రామంలో భవనాలు నిర్మించారు. ఆ భవనాల సమీపంలో ఉన్న తన పొలాన్ని ఆక్రమించి భారీ ఎత్తున ప్రహరీ నిర్మించారని అదే గ్రామానికి చెందిన రైతు గోపీకృష్ణ ఆరోపణ. తన భూమికోసం ఆయన 2015 నుంచి వివిధ రూపాల్లో ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోవడంతో రెండు నెలల కిందట కోర్టును ఆశ్రయించారు.

ఇది కూడా చదవండి: పోసాని ఇంటిపై రాళ్ల దాడి.. అసలేం జరిగింది?

Advertisement

తాజా వార్తలు

Advertisement