Wednesday, September 18, 2024

AP: నటి కాదంబరిపై కేసు – ఏసీపీ, సీఐల‌పై వేటు..

విజ‌య‌వాడ : ముంబై నటి కాదంబ‌రి జ‌త్వానీపై వేధింపుల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి.. ఆమెను వేధించిన పోలీసులపై చర్యలు మొదలయ్యాయి. ఆ సమయంలో విజయవాడలో పనిచేసిన ఏసీపీ హనుమంతరావు, అప్పటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణలపై వేటుపడింది.. పోలీసు ఉన్నతాధికారులు ఇద్దర్ని సస్పెండ్ చేస్తూ నేడు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.

ఏసీపీ హనుమంతరావును బదిలీల్లో భాగంగా కాకినాడ డీఎస్పీగా పంపగా ముంబై నటిని పోలీసులు కస్టడీకి వచ్చిన సమయంలో మళ్లీ విజయవాడ ప్రత్యేకంగా వచ్చారు. ముంబై నటి ఇంటరాగేషన్‌లో ఏసీపీ హనుమంతరావు కీలక పాత్ర వహించారు.. అలాగే సీఐ సత్యనారాయణ దర్యాప్తు అధికారిగా ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన అంశాలను పరిశీలించకుండానే ఉన్నతాధికారుల ఆదేశంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారనే అభియోగాలు వచ్చాయి.

- Advertisement -

వీరిద్దరితో పాటుగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సీతారామాంజ‌నేయులు, కాంతీరాణా, విశాల్ గున్నీల‌పైనా చర్యలకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement