Saturday, November 23, 2024

క‌ల్యాణం….క‌రోనార్ప‌ణం…

వాయిదాకే మొగ్గు… వధూవరులకు మరికొంత కాలం విరహమే
ఇప్పటికే 5వ తేదీ ముహూర్తం హుష్‌కాకి
18లోగా మరో నాలుగైదు మంచి ముహూర్తాలు.. బాజాభజంత్రీలు వెూగనట్టే
ఫంక్షన్‌హాళ్లు, పురోహితులు… మరికొన్ని వర్గాల ఆదాయానికి దెబ్బ
ఉధృతి తగ్గితే 23, 26 తేదీల్లో కొంత ఛాన్స్‌

హైదరాబాద్, : ఇది పెళ్లిళ్ల సీజన్‌.. ఈనెలలోనే మంచి ముహూర్తాలున్నాయి.. లక్షల సంఖ్యలో పెళ్లిళ్లు జరగబోతున్నాయి.. ఫంక్షన్‌ హాళ్ల దగ్గర నుండి వివాహా లకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు వధూ వరుల తల్లిదండ్రులు.. కానీ, కరోనా సెకండ్‌ వేవ్‌ వారి ఆశలపై నీళ్లు చల్లింది. గత ఏడాదిలాగానే హంగు హార్బా éటాలు లేకుండానే పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆకాశమంత పందిరివేసి ఊర్లోవారందరినీ పిలవాలను కుంటే పెళ్లి వాయిదా వేసుకోవడమే అనే సంకేతాలిచ్చింది ప్రభుత్వం. పెళ్లి ధూం..ధాంగా చేయాలని ఒక వేళ ఇప్పుడు వాయిదా వేసుకున్నా.. మరో మూడు నెలల వరకూ ముహూర్తాలు లేవు. శ్రావణ మాసంలో కొన్ని ముహూర్తాలున్నా అవేమీ అంత బలమైనవి కావని కొంత మంది పురోహితులు
చెబుతున్నారు. శ్రావణంలో కూడా వాయిదా వేసుకుంటే ఆ తరువాత ఆషాడం..మళ్లిd కార్తీక మాసం వర కూ ఆగాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో తమ పిల్లలకు పెళ్లి చేయాలన్న ఆకాంక్షతో ఉన్న తల్లిదండ్రుల ఆశలు ఆవిర వుతున్నాయి. ఈనెల 26తో మూహూర్తాలన్నీ పూర్తికాను న్నాయి. కానీ, కర్ఫ్యూ ఉండనే ఉంది. మరో వారం పాటు కర్ఫ్యూ పొడిగించారు. ఆ తరువాత పరిస్థితులనుబట్టి కర్ఫ్యూ ఉంచడమా.. ఎత్తివేయడమా అనేది నిర్ణయించాల్సి ఉంది. ఈక్రమంలో పెళ్లిళ్ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.
ప్రశ్నార్ధకంగా పెళ్లిళ్లు
కరోనా కష్టకాలంలో కల్యాణ ఘడియలు ఎలా అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. కల్యాణం..కమనీయం అన్న మాట విని ఏడాదికిపైగా అయింది. కరోనా పుణ్యమా అని సందడి లేదు. బంధువులు, స్నేహితుల ముచ్చట్లు లేవు. చేసుకుంటే సింపుల్‌ మేరేజ్‌.. లదంటే వాయిదా.. ఇదే ఇప్పటి ట్రెండ్‌. గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌ విధించ డంతో మంచి ముహూ ర్తాలన్నీ కరోనార్పణం అయ్యాయి. కల్యాణాలకు అప్పుడు పట్టిన కరోనా గ్రహణం ఇంకా వీడలేదు. మధ్యలో తగ్గినట్లే అనిపించి మరింత భీకరంగా విరుచుకుపడుతోంది కరోనా మహమ్మారి. ఈ సమయం లో పెళ్లిళ్లు ఎలాగో అర్ధం కావడం లేదు. ఆ మధ్య వైరస్‌ ప్రభావం తగ్గడంలో చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలకు పెళ్లిళ్లు చేసేందుకు మే నెలలో ముహూ ర్తాలు పెట్టుకున్నారు. పైగా ఇవి మంచి ముహూర్తాలని పురోహితులు చెప్పడంతో చాలామంది ఈ సమ యంలో పెళ్లిళ్లకు ఫిక్స య్యారు. గత ఏడా ది వాయిదా వేసుకున్న వారు వచ్చే ఏడాది ఎలా ఉంటుందో తెలియక ఆందోళన చెంది మే నెల లో పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్నారు. డిసెంబరు నుండి కరోనా తగ్గుముఖం పట్టడంతో పెళ్లిళ్లకు సంబంధి ంచిన పనులు ప్రారంభించారు.
ఆశలపై నీళ్లు
ఇటుచూస్తే కరోనా రెండో దశ భీకరంగా విరుచుకుపడుతోంది. వైరస్‌ సోకితే పరిస్థితి ఏమిటో అర్ధం కావడం లేదు. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆంక్షలు క్రమంగా కఠినతరం చేస్తుంది. పెళ్లిళ్లకు 20 మందికి మించి హాజరు కా కూడదని ఉత్తర్వులు ఇచ్చింది. అదికూడా పెళ్లి చేయాలంటే స్థానికంగా ఉన్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుని తహశీల్దార్‌ పర్మిషన్‌ ఇవ్వాల్సి ఉంది. అయితే, ఆయన అనుమతి ఇవ్వొచ్చు.. లేదా..ఇవ్వకపోవచ్చు. దీంతో ఈనెలలో పిల్లలకు పెళ్లిళ్లు చేద్దా మనుకున్న వారి గుండెల్లో రాయిపడింది. ఒకటి కాదు…రెండు కాదు.. లక్షల సంఖ్యలో పెళ్లిళ్లున్నాయి.. ఆహ్వాన పత్రికలు వెళ్లిపోయాయి. ఫంక్షన్‌ హాళ్లు దొర కనివారు, స్టేటస్‌ కోరుకునే వారు స్టార్‌ హోటళ్లు బుక్‌ చేసుకున్నారు. అలాంటివారంతా బుకింగ్స్‌ రద్దుచేసుకునే పరిస్థితి ఏర్పడింది. అయితే, ఫంక్షన్‌ హాల్స్‌ వారు, హోట ల్స్‌ యజమానులు అడ్వాన్సులు తిరిగి చెల్లించేందుకు నిరాకరిస్తున్నారు.
ఏదోలా చేసేద్దామా?
సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పెళ్లిని వాయిదా వేసుకుంటే మరో మూడు నెలల వరకూ ముహూ ర్తాలు లేవని, శ్రావణ మాసం వరకూ ఆగా ల్సిందేనని పురోహి తులు చెబుతున్నారని తల్లిదండ్రులు వాపో తున్నారు. అదికూడా శ్రావణ మాసంలో ఇంత టి బలమైన ముహూర్తాలు లేవని చెబుతున్నారు. అయి నా, అప్పటికి వైరస్‌ ఉధృతి తగ్గు తుందో ..లేదో .. తెలియదు. పైగా కరోనా మూడో దశ విరుచుకుపడుతుందనే భయాలు వెంటాడుతున్నాయి. దీంతో చాలా మంది ఈనెల లలోనే ఏదో విధంగా మూడు ముళ్లూ వేయిస్తే ఒక పనైపో తుందని భావిస్తున్నారు. అయితే, అది ఎలాగా అన్నదే ప్రశ్నగా మారింది. కరోనా భయంతో పెళ్లిళ్లు చేయడానికి పురోహి తులు కూడా జంకుతున్నారు. పిల్లల పెళ్లిళ్ల కోసం ఏర్పాట్లు చేసుకున్న అనేకమంది కుటుంబాలు అనుకన్న సమయా నికి చేయలేకపోయామనే మానసిక వేదన ఒక వైపు.. లక్షల రూపాయాలు ఆడ్వాన్సులిచ్చి తిరిగిరాక ఆర్ధి కంగా దెబ్బతగలడం మరోవైపు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఈ అయిదు ముహూర్త‌లే కీల‌కం..

ఈనెలలో 5, 13,14, 22, 26 తేదీల్లో ముహూర్తాలు బాగున్నాయని పురోహితులు చెప్పడంతో అంతా ఆ తేదీల్లోనే పెళ్లిళ్లు చేయాలని లగ్నాలు కూడా పెట్టుకున్నారు. ముఖ్యంగా 13, 14, 22, 26 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని చెప్పడంతో ఆరోజుల్లో పిల్లకు పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున మూహర్తాలను నిర్ణయించారు. చివరి నిమిషంలో ఫంక్షన్‌ హాళ్లు దొరకవనే ఉద్దేశ్యంతో భారీ మొత్తంలో అడ్వాన్సులిచ్చి వాటిని బుక్‌ చేసుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. పూజారులు, ఫోటోలు, వీడియోలు, కేటరింగ్‌, మేళాలు, షామియానా, సరుకులు, మ్యూజికల్‌ బ్యాండ్‌, కొత్త దుస్తులు, బం గారం కొనుగోళ్లు, కేటరింగ్‌ సిబ్బంది ఇలా వివాహాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను లక్షలాది రూపాయలు వెచ్చించి ముందే బుక్‌ చేసుకున్నారు.

మేలో ముహూర్తాలకే మొగ్గు ఎందుకు?
మే మాసంలో మంచి ముహుర్తాలు ఉన్నాయన్నది పురోహితుల మాట. జూన్‌, జులై, ఆగస్టులో కొన్ని ముహూర్తాలున్నా మేలో ముహూర్తాలే బలంగా ఉన్నాయని వారు చెబుతున్నారు. దాంతో ఎక్కువ పెళ్లిల్లు ఈనెలలోనే పెట్టుకున్నారు. ప్రధానంగా ఈ నెల 12, 13, 22 తేదీల్లో మంచి ముహుర్తాలు, అవి కూడా తెల్లవారుజామున ఉండడంతో బ్రహ్మముహుర్తంగా భావించి ఆ ఘడియల్లోనే పెళ్లిళ్లు చేయాలని ఎక్కువమంది భావించారు. నిజానికి ఈనెలలో 5వతేదీ నుంచి 31 వరకు మధ్య మంచి ముహూర్తాలున్నాయి. ఆ తరువాతి నెలల్లో ముహూర్తాలున్నా మేలో మాదిరిగా బలంగా లేవని అంటున్నారు. జూన్‌ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వానలలో పెళ్లి చేయలేమని మే ముహూర్తాలకే మొగ్గు చూపుతున్నారు. జులైలో ఆషాడం వస్తుండగా, ఆగష్టులో కొద్ది రోజులు మాత్రమేమళ్లి మంచి ముహుర్తాలు ఉన్నాయి. అయితే ఆగష్టులో జరిపే పెండ్లిండ్లకు వాతావరణ ప్రతికూలతల నేపథ్యంలో పెళ్లి జరిపేందుకు అంతగా ఆసక్తి కనబరచరు. ఇక సెప్టెంబర్‌లో వచ్చేది భాద్రపదం..శూన్యమాసం పెళ్లిళ్లు చేయరు. అనంతరం అక్టోబర్‌లో ఆశ్వీయిజం, కార్తీకంలో కొన్ని మంచి ముహూర్తాలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే ఆ నెలల్లో పెళ్లిళ్లకు సిద్ధమవుతారు. దీంతో ఎలా చూసినా మేలో ముహూర్తాలకే ప్రాధాన్యం ఉంది. అయితే కరోనా అందరినీ భయపెడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement