Thursday, November 21, 2024

AP : కారు బోల్తా.. ముగ్గురు మహిళలు మృతి

పెళ్లి ఇంట విషాదం.
గుర్రం వారి పాలెంలో విషాద చాయలు.
హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం
ముగ్గురు మహిళలు మృతి.మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు.
డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం. ఒంగోలు డిఎస్పీ కిషోర్.


టంగుటూరు మార్చి 28(ప్రభ న్యూస్) హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం పెళ్లింట విషాదం మిగిల్చింది. గుర్రం వారి పాలెం లో విషాదఛాయలు అలుముకున్నాయి. హైవేపై ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన జాతీయ రహదారిపై తూర్పు నాయుడుపాలెం చోటు చేసుకుంది. మండలంలోని తూర్పు నాయుడుపాలెం సమీపంలో బుధవారం డ్రైవర్ నిర్లక్ష్యంతో జాతీయ రహదారిపై కారు బోల్తా పడి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు మహిళలు మృతి చందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

మృతులు నెల్లూరు జిల్లా కందుకూరు టౌన్ పరిధిలోని గుర్రం వారి పాలెం గ్రామస్తులుగా గుర్తించారు. మృతులు నెల్లూరు జిల్లా కందుకూరు టౌన్ పరిధిలోని గుర్రం వారి పాలెం చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతులు కుమార్తె వివాహం నిమిత్తం భద్రాచలం సమీపంలో నే పాలవంచ లో వివాహం ముగిసిన అనంతరం కుటుంబ సభ్యులు సొంత ఊరు కందుకూరు పెళ్లి కారులో బయలుదేరారు. కుటుంబ సభ్యులు రాయిని వేణు. తలపనేని వినోద్.రాయని అరుణ.తలపునేని దివ్య. గుల్లపల్లి శ్రావణి కారులో బయలుదేరారు. సమీపంలోనే రాగానే డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒక్కసారిగా కారు అదుపుతప్పి డివైడర్ ని ఢీ కొట్టింది.. ప్రమాద సమయంలో కారులో ఉన్న ముగ్గురు మహిళలు ఘటన స్థలంలోనే మృతి చెందారు. కారులో ఉన్న డ్రైవర్ తో పాటు బాలుడికి స్వల్ప గాయాలు అవటంతో వైద్యం నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు.

ప్రమాద విషయం తెలుసుకున్న ఒంగోలు డిఎస్పి కిషోర్ ఘటన స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను గల కారణాలను తెలుసుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా ఒంగోలు డిఎస్పి కిషోర్ మాట్లాడుతూ పెళ్లి బృందం కూతురు వివాహం అనంతరం స్వగ్రామానికి వస్తూన్న నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగిందన్నారు. డైవర్ నిర్లక్ష్యంతో ఈ ప్రమాదం సంభవించింది అన్నారు. ప్రమాదం సమయంలో కారులో పెళ్లి కుమార్తె తల్లి రాయిని అరుణ (50) పెళ్లి కుమార్తె మేనమామ భార్య తలపునేని దివ్య (28) పెళ్లి కుమార్తె చెల్లెలు గుల్లపల్లి శ్రావణి (22) ఘటనా స్థలంలోని ముగ్గురు మహిళలు మృతి చెందారు.

ప్రమాద సమయంలో కారులో ఉన్న పెళ్లి కుమార్తె అన్నయ్య రాయిని వేణు. పెళ్లి కుమార్తె మేనమామ తలపు నేను వినోద్ కు తీవ్ర గాయాలు అవటంతో అతి కష్టం మీద కారులో ఇరుక్కున్న ఇద్దరు ను పోలీసులు శ్రమించి వైద్యం నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు . డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఒంగోలు రిమ్స్ కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం బంధువులకు మృతదేహాలను అప్పగిస్తామని తెలిపారు. హైవేపై ప్రమాదాల నియంత్రణకు పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు డిఎస్పి తెలిపారు. డీఎస్పీ వెంట సింగరాయకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ దాచేపల్లి రంగనాథ్. ఏ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement