సోంపేట జనవరి 20(ఆంధ్రప్రభ ) శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలంతరకోట జంక్షన్ పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుని పరిస్థితి విషమంగా ఉంది. సోమవారం ఉదయం 7గంటల సమయంలోకంచిలి మండలం జలంతర కోట జంక్షన్ పరిధిలో జాతీయ రహదారిపై (అపోలో టైర్స్ ఎదురుగా )కారును లారీ ఢీకొట్టడంతో బారువ కు చెందిన, హరీష్ కుమార్ పాణిగ్రహి, అక్కడకక్కడే మృతి చెందగా,అనిల్ కుమార్ పాణిగ్రహి, కొన ఊపిరితో సోంపేట ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు.
.పరిస్థితి విషమంతో వైద్యులు సలహా మేరకు శ్రీకాకుళం తరలించారు. కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు