Friday, November 22, 2024

సముద్రంలోకి దూసుకెళ్లిన కారు

తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ నుండి కాకినాడ వెళ్లే బీచ్ రోడ్ లో ఓ కారు సముద్రంలోకి దూసుకెళ్లింది. అయితే, తృటిలో ప్రమాదం తప్పింది. నిన్నసాయంత్రం మద్యం మత్తులో యువకులు చెక్కెర్లు కొడుతుండగా ఈ సంఘటన జరిగింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగు యువకులు సురక్షితంగా బయటపడ్డారు. సముద్రాన్ని తిలకించేందుకు వచ్చిన పర్యాటకులు, స్థానికులు సుమారు రెండు గంటలపాటు కష్టపడి ట్రాక్టర్ సహాయంతో కారును బయటకు తీసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement