విజయవాడ కార్పొరేషన్: విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్‌పై ఇవ్వాల (సోమవారం) ఓ కారు బీభత్సం సృష్టించింది. కారులో వచ్చిన వ్యక్తి ఇష్టమున్నట్టు నడపడంతో అక్కడున్న వారిమీదకు దూసుకెళ్లింది. విజయవాడ నగర పాలక సంస్థకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు ఫ్లై ఓవర్ పై రోడ్లను శుభ్రం చేస్తుడగా వేగంగా వచ్చిన కారు వారిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో మహిళ పారిశుద్ధ్య కార్మికురాలు షేక్ నాగర్ బీ అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి సీరియస్‌గానే ఉందని డాక్టర్లు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పటమట పోలీసులు తెలిపారు.