కర్నూలు, ప్రభన్యూస్ : జిల్లాలో గంజాయి గుప్పుమంటున్నది. దమ్మరా…. దమ్ అంటూ 20 ఏళ్ల యువత నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు మత్తులో మునిగితేలుతున్నారు. మొదట నగరాలకే పరిమితమైన గంజాయి విక్రయాలు ప్రస్తుతం మండల, గ్రామాలకు పాకుతున్నది. మొన్నటి వరకు సిగరెట్టు, మద్యం తాగడం, గుట్కాలు తినడం ఓ ఫ్యాషన్‌గా భావిస్తున్న చదువుకున్న యువత ప్రస్తుతం గంజాయిని ఎంజాయి చేస్తున్నారు. మత్తులో జోగుతూ ఇదే మాయాలోకంగా భావిస్తున్నారు. సరదాగా మొదలు పెట్టి ఆ తర్వాత తమకు తెలియకుండానే చిత్తవుతున్నారు. తల్లిదండ్రుల కళలను చిదిమేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఈ సంస్కృతి చాపకింద నీరులా పాకుతోంది. ఇందుకోసం కొన్ని ప్రాంతాలు అడ్డాలుగా మారాయి. ఇటీ-వల పోలీసు తనిఖీల్లో వెలుగుచూసిన ఘటనలే ఇందుకు తార్కాణం. పవిత్ర పుణ్యక్షేత్రాలైన మహానంది, శ్రీశైలం, మంత్రాలయం, మద్దిలేటి స్వామి ఆలయం, ఉరుకుంద ఆలయ పరిసరాలు గంజాయి విక్రయాలకు అడ్డాగా మారాయి. శివాలయాల పరిసరాల్లో ఉండే 75 శాతం బిక్షాటకులు, సాధువులు అధిక భాగం .. గంజాయ్ మత్తులో వినియోగిస్తున్న వారిలో ఉన్నారు. ప్రముఖంగా శివలయాలు ఉన్నచోట సాధువులు అధికంగా ఉండగా, వీరిలో 75 శాతం గంజాయి మత్తులో కూరుకుపోయారు. పోలీసుల నిఘా నిద్రపోతుండటంతో స్మగ్లర్లు మరింత రెచ్చిపోతున్నారు.
పేద యువకులే విక్రేతలు…
గంజాయి స్మగ్లర్లు తమ విక్రయాలకు పేద యువతనే ఎరగా ఎంచుకుంటారు. నిరుద్యోగ యువకులు, కళాశాలలో చదువుకుంటు-న్న విద్యార్దులను, నిరుపేద కుటు-ంబాలకు చెందిన వారిని గంజాయి రవాణాలో పావులుగా వాడుకుంటున్నారు. కిలోకు రూ. 1000 ఇస్తుండటంతో నిరుద్యోగ యువత వీటి విక్రయం పట్ల అసక్తి చూపుతున్నారు. పట్టు-బడ్డ వారిలో 90 శాతం మంది వీరే. యువకులు, విద్యార్ధులు బైకుల ద్వార రవాణా చేస్తున్నారు. ఆటోలు, జీపుల్లో ప్రయాణికుల మాదిరిగా గంజాయి బ్యాగులతో వెళుతుంటారు. ట్రిప్కు రూ. లక్ష వరకు చెల్లిస్తారు. పోలీసులు పట్టు-కుంటే డ్రైవర్‌కు మెయిల్, అతను జైలులో ఉన్నంత కాలం కుటుంబ పోషణను స్మగ్లర్లే చూసుకుంటారు. బైక్‌పై తరలిస్తే రూ. 25వేలు చెల్లిస్తారు.
గంజాయి నెట్‌వర్కు విశాఖ మన్యం మూలం..
గంజాయి నెట్ వర్కు మూలాలు విశాఖ పట్టణంలోని ఏజెన్సీ ప్రాంతమన్నది బహిరంగ సత్యం. ఆ జిల్లాలో ఒడిస్సా సరిహద్దును అనుకుని ఉండే ఎనిమిది గిరిజన మండలాలు గంజాయి ఉత్పత్తికి హబ్‌గా పేర్కొంటారు. అక్కడ వందకు పైగా పంచాయతీల్లో 25వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారన్నది అంచనా. దేశంలో ఏ మూల గంజాయి పట్టు బడ్డా సరుకు మూలాలు అక్కడే తేలుతున్నాయి. లక్ష రూపాయల పెట్టు బడి పెడితే ఐదు నెలల్లో పది లక్షల ఆదాయం వస్తుండటంతో గిరిజన ప్రాంత రైతులు అన్నింటికీ తెగించి అక్కడ ఈ పంట సాగు చేస్తున్నారు. ఏడాదిలో రెండు పంటలు కూడా వేస్తున్నారు. దీంతో దేశ నలుమూల నుంచి గంజాయి స్మగ్లర్లు ఇక్కడకు వచ్చి, ముందుగా పెట్టు-బడి పెట్టి సరుకు బుక్ చేసుకొని వెళతారు. విశాఖ మన్యంలో శాస్త్రీయ అధునిక పద్ధతుల్లో గంజాయి సాగు చేస్తున్నారు. వాగుల నుంచి నిరంతర నీటి సరఫరా ఉండేట్లు జాగ్రత్తలు వహిస్తారు. సేంద్రీయ పద్ధతిలోనే వీటి సాగు సాగుతుంది. ఎకరా విస్తీర్ణంలో సాగుకు లక్షరూపాయలకు మించి వ్యయం చేస్తారు. సుమారు 500 కిలోల నాణ్యమైన శీలవతి, రకం దిగుబడి వస్తుంది. సాధారణంగా గంజాయి సాగును ఆగస్టు, లేదా సెప్టెంబర్‌లో సాగు చేస్తారు. డిసెంబర్ నాటికి ఈ పంట చేతికి వస్తుంది. ఏపుగా ఆకులతో కూడిన కొమ్మలు వస్తాయి. గంజాయి మొక్కపై కళ్లం అనే పుష్పం వస్తుంది. వీటిద్వారా నల్లమందు ఉత్పత్తి చేస్తారు. గంజాయికి ఓ రేటు- ఉంటే మొక్కపై వచ్చే కళ్లంకు ప్రత్యేక ధర ఉండటం విశేషం. విశాఖ మన్యంలో గంజాయిని ఇళ్ల వద్దకే వచ్చి కిలో రూ. 2వేల చొప్పున కోనుగోలు చేస్తారు. ప్యాకింగ్ అక్కడి నుంచి మైదానా ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు-, అందుకు అయ్యే వ్యయం స్మగ్లర్లే చూసుకుంటారు. ఐదు నెలల్లో లక్ష రూపాయల పెట్టబడితో రూ.10 లక్షల ఆదాయం వస్తుంది. అంటే ఖర్చులు పోను రూ.9 లక్షలు మిగులుతాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటకల మీదుగా స్మగ్లర్లు వచ్చి రైతులకు పెట్టు-బడులు పెడతారు. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్ల ఖర్చును ముందే ఇచ్చేస్తారు.
నల్లమల అడవులు సాగుకు కేంద్రాలు…
నల్లమల అటవీ పరిధిలోని శ్రీశైలం అడవుల్లో కూడా గంజాయి విసృతంగా సాగవుతుందన్న అనుమానాలు లేకపోలేదు. కారణం గతంలో ఇక్కడ కూడా పెద్ద ఎత్తున గంజాయి సాగు చేసిన మూలాలు లేకపోలేదు. ముఖ్యంగా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని శివపురం అటవీ ప్రాంతంలో గంజాయి సాగు మూలులు ఉన్నాయి. ప్రధానంగా నల్లమల అడవుల్లోని దుర్గం, అంకాలమ్మకోట, మిరపకాయ పెంట తదితర ప్రాంతాలతో పాటు- గిరిజన గుడాల కు సమీపంలో దాఖలు చేసిన ఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా నల్లమల అడవుల్లో పోరు భూముల్లో గంజాయిని సాగు చేసేవారు. సాధారణంగా గంజాయి పంటను వర్షాకాలంలో అంటే జూలై ఆగస్టు నెలలో సాగు చేస్తారు. డిసెంబర్ నాటికి పంట చేతికి వస్తుంది. మొక్క ఏపుగా పెరిగి.. చివరి భాగంలో కళ్లం వచ్చేవరకు గంజాయిని సాగు చేస్తారు. కొత్తపల్లి అడవి పరిధిలోని అంకాలమ్మ కోట, కొలనుభారతి క్షేత్రం అటవీ భూములోని పోరు భూములలో ఇప్పటికి గంజాయి సాగు అవుతున్నది సమాచారం. గంజాయి సాగు క్రమంలో ఈ ప్రాంత చేంచు గిరిజనులను వాటికి కాపలాగా వినియోగిస్తూ సాగు చేస్తారు. చెంచు గిరిజనులు కాపలాగా ఉండటం వల్ల ఆ ప్రాంతంకు వెళ్లేందుకు వీలుండదు. చెంచు గిరిజనులకు మాత్రమే ఆయా ప్రాంతాలపై పట్టు- ఉండటం వల్ల ఇతరుకు అక్కడికి వెళ్లేందుకు అవకాశం ఉండదు. వీటిని ఆసరా చేసుకొని కొందరు గంజాయి స్మగ్లర్లు తెగ పడుతున్నట్టు- సమాచారం.అయితే నల్లమల అడవులపై పూర్తి స్థాయిలో అటవీశాఖ దృష్టిపెట్టడం, పులుల గణన కోసం అటవీ ప్రాంతాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు- చేయడం, గంజాయి సాగుపై పోలీసు, ఎ-కై-్సజ్ పెద్ద ఎత్తున దృష్టి సారించి దాడులు నిర్వహించడంతో నల్లమల అడవుల్లో గంజాయి సాగు కొన్ని ప్రాంతాల్లో నిర్విర్యమైంది. అయితే ఇటీ-వల కాలంలో శ్రీశైల పుణ్యక్షేత్ర పరిధిలో సాధువులు అధికంగా గంజాయిని వినియోగిస్తుండటంతో నల్లమలలో సాగుపై అనుమానాలు లేకపోలేదు.
విశాఖ మన్యం నుంచే కిలోల మెరుకు గంజాయి రవాణా..
విశాఖ మన్యం నుంచే కిలోల మెరుకు గంజాయి రవాణానల్లమల, ఓడిస్సాను పక్కనబెడితే ఒక్క విశాఖ జిల్లా నుంచే ఏటా కోటీ- కిలోల గంజాయి ఉత్పత్తి జరుగుతుందన్న బహిరంగ సత్యం. బహిరంగ మార్కేట్‌లో వీటి విలువ రూ. 15వేల కోట్ల వరకు ఉండోచ్చని అంచనా. ఇక్కడి నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు-, పోరుగు రాష్ట్రాల్రకు సైతం ఎగుమతి అవుతుంది. ఇందుకు ఉదహారణ ఇటీ-వల పంచలింగాల చెక్‌పోస్టు వద్ద సెబ్ పోలీసుల తనిఖీలో పలుమార్లు గంజాయి పట్టబడగా, ఇందులో అధిక భాగం వైజాగ్ నుంచి కర్నూలు మీదుగా పోరుగు రాష్ట్రాల్రైన తమిళనాడు, బెంగుళూరు తదితర ప్రాంతాలకు తరలిస్తుండగా పట్టబడినవే.గంజాయి రవాణాను స్మగ్లర్లు, పోలీసు, ఎ-కై-్సజ్, రెవెన్యూ, అటవీశాఖలోని కొంతమంది అధికారులు, సిబ్బంది సహాయంతో యథేచ్చగా గంజాయిని రవాణా చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్రకు చెందిన స్మగ్లర్లే పూర్తి అండదండలు అందిస్తున్నారు. వారికి భారీ నెట్ వర్కు ఉంది. వారి మనుషులు మండల, పంచాయితీ కేంద్రాల్లో ఎవరికి అనుమానం రాకుండా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. విత్తనాలు, క్రిమిసంహారక మందులు, ఎరువులు అడ్వాన్సులు ఇవ్వడం ఈ నెట్ వర్కు పని . మరి కొందరు గ్రామాల్లో నివాసం ఉంటూ సాగు, కోత, ప్యాకింగ్‌తో పాటు- ఏజెన్సీ మైదానా ప్రాంతానికి తరలించే బాద్యత తీసుకుంటారు. ఇక్కడ నుంచి ఏటా కోటీ- కిలోలు రవాణా అవుతుంది. ఇందులో కేవలం ఐదు శాతం వివిధ రాష్ట్రాల్ర పోలీసులకు చిక్కుతుంది. గంజాయి రవాణాకు ఎప్పటికప్పుడు స్మగ్లర్లు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. గతంలో గోనే సంచుల్లో తరలించే వారు. కొంత కాలం నుంచి చిన్న ప్యాకేట్లు-గా మార్చి తరలిస్తున్నారు. జిల్లాలో గత ఏడాది కాలంలో గంజాయి రవాణాకు సంబందించి 52 కేసులకు పైగా నమోదయ్యాయి. సుమారు 789 కేజిల వరకు పట్టబడ్డాయి. ఇటీ-వల నంద్యాలకు చెందిన ఓ వ్యక్తి విజయవాడ నుంచి రైలులో 22 కిలోల గంజాయి తరలిస్తుండగా, డోన్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఐదుగురు వ్యక్తులు నంద్యాల నుంచి కర్నూలుకు గంజాయి రవాణా చేస్తుండగా, పాణ్యం పోలీసుల తనిఖీలో దొరికిపోయారు. వీరి నుంచి 20 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగిందంటే జిల్లాలో గంజాయి విక్రయాలు ఏ విధంగా సాగుతున్నాయో గ్రహించవచ్చు. ఇప్పటి వరకు గంజాయిని విక్రయం, తరలిస్తున్న వారు గత ఏడాది కాలంలో దాదాపు 112 మందిని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం.
గంజాయి మత్తులో .. అనారోగ్యం..
గంజాయి తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి కోల్పోతారు. ముఖ్యంగా మొదడు, గుండే, కేంద్ర నాడీ వ్యవస్ధపై ఎక్కవ ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్బంలో విచక్షణ కోల్పోయి దాడులకు పాల్పడుతారు. నోరు మొద్దుబారుతుంది. ఆకలి మందగిస్తుంది. నరాల వ్యవస్ధ చచ్చుబడిపోతాయి. నిటారుగా వణికిపోతుంటారు. ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి. ఒక్కొక్కసారి క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటు-ంది. మరీ ఎక్కువగా తీసుకుంటే రోగ నిరోధకశక్తి తగ్గిపోయి, జీర్ణ వ్యవస్ధ దెబ్బతింటు-ంది. ఏం తిన్నా అరగదు. విపరీతంగా కడుపునొప్పి వస్తుంది. కాలేయం పూర్తిగా పాడై శరీరం శుష్కించి పోతుంది. ఫలితంగా ప్రాణం గాలిలో కలిసి పోయే ప్రమాదం లేకపోలేదు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..