నిత్యం కిటకిటలాడే విజయవాడ స్టేషన్ రైళ్ల రద్దు కారణంగా అన్ని ప్లాట్‌ఫారాలు ఖాళీగా మారాయి.రైళ్ల రద్దు, టికెట్ల వాపసు ద్వారా ఆ శాఖకు రూ. కోట్లలో నష్టం వాటిల్లింది. తుపాను నేపథ్యంలో బుధవారం కూడా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
07784/07785 గుంటూరు- రేపల్లె, 07786 గుంటూరు-రేపల్లె, 07873/07874 రేపల్లె-తెనాలి, 07875/07876 రేపల్లె-తెనాలి, 07787/07888 రేపల్లె-తెనాలి, 07887 గుంటూరు-రేపల్లె, 22611 చెన్నైసెంట్రల్-న్యూజల్పాయిగురి రైళ్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. ప్రత్యేక హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి ప్రయాణికులకు సమాచారం అందిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ హైఅలర్ట్ ప్రకటించారు. రైల్వే ట్రాక్‌పై నీరు చేరే అవకాశం ఉన్న ప్రదేశాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. 24 గంటలూ రైల్వే సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్‌తో పాటు అన్ని విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.