Friday, November 22, 2024

స్పేస్​లో మొక్కలు జీవించగలవా? ఇట్లా ఎప్పుడైనా ఆలోచించారా.. కానీ, శిరీష ఆలోచనలే వేరు!

మొక్కలు అంతరిక్షంలో జీవించగలవా అని మీరు ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? కానీ, 34 ఏళ్ల భారత సంతతికి చెందిన ఏరోనాటికల్ ఇంజినీర్ శిరీష బండ్ల వెతుకుతున్న సమాధానం ఇదే.. శిరీష వర్జిన్ గెలాక్టిక్ యొక్క మొట్టమొదటి పూర్తి సిబ్బందితో కూడిన విమానంలో అంతరిక్షంలోకి ప్రయాణించిన భారతీయ సంతతి మహిళ. ఆమె టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో పెరిగినా… ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు సిటీకి చెందిన వ్యక్తిగానే గుర్తింపు పొందింది.

కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత అంతరిక్షంలోకి ప్రయాణించిన మూడో భారతీయ సంతతికి చెందిన మహిళగా శిరీష గుర్తింపు పొందారు. ఇక.. అంతరిక్షంలోకి తన తొలి జర్నీ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చార.. ఆమె తన విమానంలో చేసిన ప్రయోగం గురించి వివరంగా తెలిపారు. కఠినమైన వాతావరణంలో, అంతరిక్షంలో కూడా జన్యుపరంగా మార్పు చెందిన మొక్కలు జీవించేలా ప్రయోగాలు జరుగుతున్నాయని శిరీష పేర్కొన్నారు.

మేము జన్యుపరంగా మార్పు చెందిన మొక్కలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లాం. తద్వారా పర్యావరణ ఒత్తిడి ఎంట్లుంటుందో, మొక్కలు దానికి ఎలా స్పందిస్తాయో అన్న విషయాలను అర్థం చేసుకునే పరీక్షలు కొన్ని చేపట్టాం” అని చెప్పారు శిరీష. అంతరిక్షంలోకి వెళ్లడం తనకు జీవితకాల అనుభవం అని కూడా పేర్కొన్నారు, తన అనుభవాన్ని వివరించడానికి పదాలు తక్కువగా ఉన్నాయని.. అది మాటల్లో చెప్పలేని అనుభూతిగా పేర్కొన్నారు.

మరోసారి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నా..

“వర్జిన్ గెలాక్టిక్ అనేది ఎవరికైనా అంతరిక్షంలోకి వెళ్ళే అవకాశాన్ని అనుమతించే ఒక వేదిక. వర్జిన్ గెలాక్టిక్ వాణిజ్యపరమైన అంతరిక్ష యాత్రలను ప్రారంభించాలని ఆలోచిస్తోంది. దీంతో అన్వేషించాలనుకునే ప్రతి ఒక్కరికీ ఇది డోర్స్​ ఓపెన్​ చేసింది. అని ఆమె తెలిపారు. తనకు ఎప్పటి నుంచో వ్యోమగామి కావాలనే కోరిక ఉండేదని, అయితే కంటి చూపు సరిగా లేకపోవడం వల్ల తన కల నెరవేరలేదని చెప్పింది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా)లో చేరలేకపోయింది. అయితే ఇది అంతరిక్షంలోకి వెళ్లాలనే తన కలను మాత్రం ఆపలేదు. ఆ తర్వాత బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్‌తో కలిసి వాణిజ్య రంగంలోకి ప్రవేశించింది. ఏరోనాటికల్ ఇంజనీర్, పరిశోధకురాలిగా తన వృత్తిని ప్రారంభించింది.

- Advertisement -

“నేను నక్షత్రాలను చూసినప్పుడల్లా అక్కడ ఏం ఉందో తెలుసుకోవాలని అనుకుంటా. అన్వేషించాలనే ఉత్సుకత, తపన నన్ను దాని వైపుకు నడిపించిందేమో’’ అని చెప్పుకొచ్చింది శిరీష. ఆమె వర్జిన్ గెలాక్టిక్ VSS యూనిటీలో ఒక భాగం. దీనిని స్పేస్‌ప్లేన్ అని పిలుస్తారు. వర్జిన్ గెలాక్టిక్‌ను రిచర్డ్ బ్రాన్సన్ 2004లో ప్రారంభించారు. ఇది ప్రైవేట్ పౌరులు అంతరిక్షంలోకి వెళ్లేందుకు సహాయపడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement