Monday, December 9, 2024

AP | నేవీ ఉద్యోగాల పేరుతో వల.. మంత్రి లోకేష్ సీరియస్

ఇండియన్ ఆర్మీకి కాలింగ్ సంస్థ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ కంపెనీ వ్యవస్థాపకుడు బసవ రమణ ఉచితంగా ఆర్మీ శిక్షణ ఇప్పిస్తానని అభ్యర్థులను చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో నిరుద్యోగుల బలహీనతతో ఆడుతున్న బసవ రమణపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

ఇండియన్ ఆర్మీ, నేవీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని విద్యార్థులకు ఆశ చూపించి అభ్య‌ర్థుల నుంచి కంపెనీ వ్యవస్థాపకుడు బసవ రమణ రూ.5 లక్షలు నుంచి రూ.10 లక్షల వరకూ వసూలు చేశారని నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. తీరా ఉద్యోగాలు ఎప్పుడు ఇప్పిస్తారని అడిగిన విద్యార్థులను, యువతను కొడుతున్నారంటూ ఓ వీడియో కూడా షేర్ చేశారు.

ఈ సమస్యను సీరియస్‌గా తీసుకోవాలంటూ నారా లోకేష్‌ను కోరారు. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ వ్యవహారంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. కారణాలు ఏవైనా కానీ.. ఇలాంటి చర్యలు సరికాదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ వ్యవహారం మీద సరైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పోలీసులు, శ్రీకాకుళం జిల్లా పోలీసులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement