Friday, November 22, 2024

విద్యుత్​ ఎమర్జెన్సీకి 1912కు కాల్‌ చేయాలి : పీసీపీడీసీఎల్‌ సీఎండీ

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశముందని, విద్యుత్‌ వినియోగదారులు, రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఏపీసీపీడీసీఎల్‌ సీఎండీ పద్మా జనార్థన్‌ రెడ్డి విజ్ఞప్తిచేశారు. ఈమేరకు మంగళవారం ఆయన ఆంధ్రప్రభతో మాట్లాడుతూ, విద్యుత్‌ ప్రమాదాల వల్ల విలువైన ప్రాణాలు పోగొట్టుకునే ప్రమాదం ఉందన్నారు. కరెంటుతో సంబంధం ఉండే ఏ వస్తువునైనా తాకే ముందుకు ఒకటికి రెండు సార్లు పరిశీలనచేసిన తరువాతే తాకాలన్నారు. గత మూడు రోజులు నుండి ఎడతెరుపు లేకుండా అతిగా కురుస్తున్న వర్షాలు, గాలుల వల్ల కొంత మంది రైతులకు సంబంధించిన కరెంట్‌ మోటార్లు మునిగి ఉండే అవకాశముందన్నారు. మరికొందరికి చెందిన మోటార్‌ స్టార్టర్లు, డబ్బాలు తడిసివుంటాయన్నారు. అంతేకాకుండా సర్వీసు వైర్లు డామేజ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. అంతేకాకుండా వర్షాలకు నేల తడిసి కరెంటు స్థంబాలు పడిపోవడం, వైర్లు తెగిపోవడం వంటివి కూడా జరిగే ప్రమాదం ఉందన్నారు.

ఈ పరిస్థితుల్లో వాటిని ముట్టు-కొనే ప్రయత్నం కాని, దగ్గరకు వెళ్లే ప్రయత్నం కాని చేయకూడదని ఆయన సూచించారు. ఆక్వా రైతులు ఏరియేటర్స్‌ను ముట్టు-కోనరాదని తెలిపారు. వీటన్నింటి దృష్ట్యా విద్యుత్‌ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందన్నారు. ఇక గృహ వినియోగదారులకు సంబంధించి ఇంటి సర్వీస్‌ వైర్లని కాని, వాటితో వెలాడే ఇనుప తీగలను కానీ, కరెంట్‌ స్థంభాలను కానీ, ఇనుప స్తంభాలను కానీ, లైన్ల మీద చెట్టు కొమ్మలు పడిన కానీ వాటిని ముట్టు-కొనే ప్రయత్నం చేయకూడదన్నారు. అలాగే తడిచేతులతో ఇంట్లోని స్విచ్‌ బోర్డులను ముట్టు-కో వల్ల కూడా విద్యుత్‌ షాక్‌తో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. విద్యుత్‌ షాక్‌తో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలని విజ్ఞప్తిచేశారు. ఎక్కడైనా, ఏదైనా విద్యుత్‌ సమస్య తలెత్తినా, తీగలు తెగి ఉన్నా, పోల్స్‌ పడిపోయినావెంటనే సమీపంలోని లైన్‌ ఇన్‌స్పెక్టర్‌కుగానీ, సంబంధిత ఏఈకిగానీ లేదా టోల్‌ ఫ్రీ నంబరు 1912 కు కానీ తెలియజేయజేయాలని పద్మా జనార్థన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement