Friday, September 20, 2024

AP | వరద సాయం పర్యవేక్షణకు కేబినెట్‌ సబ్ కమిటీ

ఆంధ్రప్రదేశ్‌లో వరద నష్టం అంచనా, వరద సహాయక చర్యల పర్యవేక్షణ కోసం విధివిధానాలను రూపొందించడానికి ప్రభుత్వం నలుగురు మంత్రులతో కేబినెట్‌ సబ్ కమిటీని నియమించింది. కేబినెట్ సబ్‌కమిటీ కన్వీనర్‌గా రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్‌ను నియమించారు.

వరద నష్టం అంచనాలపై విధివిధానాలు రూపొందించి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సిఫార్సులు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘంలో మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, వంగలపూడి అనిత, సత్యప్రసాద్ ఉన్నారు.

పారిశుద్ధ్య పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి..

మరోవైపు విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. ఐఏఎస్ హరినారాయణన్ స్థానంలో ఐఏఎస్ కన్నబాబు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement