Sunday, December 1, 2024

AP | చీఫ్ విప్ జీవీ ఆంజనేయులుకు కేబినెట్ హోదా

ఏపీ ప్రభుత్వ చీఫ్‌విప్‌గా నియమితులైన వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జివి ఆంజనేయులుకు కేబినెట్ మంత్రి హోదా లభించింది. ఇతర విప్‌లకు రాష్ట్ర మంత్రి హోదా ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, అసెంబ్లీ, శాసనమండలికి ఇద్దరు చీఫ్‌విప్‌లు, 18 మంది విప్‌లను ప్ర‌భుత్వం నిన్న‌ ప్రకటించింది. గత ప్రభుత్వంలో అసెంబ్లీ, మండలిలో చీఫ్‌విప్‌లు, విప్‌ల సంఖ్య 9 ఉండగా, కూట‌మి ప్రభుత్వం ఆ సంఖ్యను 20కి పెంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement