Tuesday, November 19, 2024

Eluru: పంచాయతీలకు ఉప ఎన్నికలు.. పకడ్బందీ ఏర్పాట్లు.. ఎస్పీ

ఏలూరు, ప్రభ న్యూస్ క్రైమ్ : ఏలూరు జిల్లాలో జరిగే పంచాయతీ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలాగా పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టినట్లు ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తెలిపారు. పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పోలింగ్ కేంద్రాలకు 100మీటర్ల దూరం వరకు ఓటర్లకు తప్ప ఇతరులకు అనుమతి లేదన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏ విధమైన ప్రచారాలు చేయరాదని, ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడం కానీ, ప్రలోభాలకు గురి చేయడం కానీ చేసిన యెడల చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.


పోలింగ్ రోజైన శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. కౌంటింగ్ ప్రక్రియ కూడా రేపు మధ్యాహ్నం 2 గంటల నుండీ నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియల సందర్భంగా ఎలాంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకమైన భద్రతా చర్యలు తీసుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement