అంబాజీపేట మండలంలోని పసుపల్లి గ్రామ ఎం.పి.టి.సి ఎన్నికకు సంబంధించి స్ట్రాంగ్ రూమ్ ను అమలాపురం ఆర్.డి.ఓ వసంతరాయుడు పరిశీలించారు. గత ఏప్రిల్ నెలలో జరిగిన ఎం.పి.టి.సి ఎన్నికల కు సంబంధించి వైసీపీ తరపున పిల్లి కోటేశ్వరి పోటీ చేసింది.అయితే ఎన్నికల ఫలితాల పై, హై కోర్టు స్టే విధించడంతో ఎన్నికల లెక్కింపు ప్రక్రియ నిలిచి పోయింది.ఈ నేపధ్యంలో కరోనా వ్యాప్తి చెందడంతో కోటేశ్వరి మృతి చెందింది.ఎన్నికల లెక్కింపునకు హై కోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సెప్టెంబర్ నెలలో జరిగిన లెక్కింపులో కొటేస్వరి గెలుపొందింది.అయితే ఆమె మృతి చెందడంతో ఎన్నిక రద్దయింది. ప్రభుత్వం ఈ నెల 15 న ఉప ఎన్నిక నిర్వహించాలని ఆదేశాలు రావడంతో మండల ప్రధాన కేంద్ర మైన అంబాజీపేట హైస్కూలు లో స్ట్రాంగ్ రూమ్ ను అమలాపురం ఆర్.డి.ఓ పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దార్ ఎల్.జోసెఫ్,ఎం.పి.డి.ఓ,వి.శాంతామణి,ఎన్నికల అధికారి ఎన్. మల్లిఖార్జున రావులు వున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement