Friday, November 22, 2024

కేర‌ళ‌లో అయ్య‌ప్ప భ‌క్తుల బ‌స్సు బోల్తా.. 18 మందికి తీవ్ర గాయాలు, న‌లుగురి ప‌రిస్థితి విష‌మం

ఏలూరు, (ప్రభన్యూస్) : అయ్య‌ప్ప భ‌క్తులు ప్ర‌యాణిస్తున్న బ‌స్సు కేర‌ళ‌లో ప్ర‌మాదానికి గుర‌య్యింది. అయ్య‌ప్ప స్వామి ద‌ర్శ‌నం అనంత‌రం ఇంటికి తిరిగి వ‌స్తుండ‌గా ప‌త‌నంతిట్ట జిల్లా లాహ‌ల్యాంపు బోటు ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. కాగా, ఆ బ‌స్సులో 18 మందికి గాయాలు కాగా, వీరిలో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, అందులో ఎనిమిదేండ్ల బాలుడు కూడా ఉన్న‌ట్టు అధికారులు తెలిపారు.

ఏలూరు సమీపంలోని మాదేపల్లికి చెందిన అయ్యప్పభక్తులు 15వ తేదీన శబరిమలై వెళ్లారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుని ఇవ్వాల (శనివారం) తిరిగి వస్తున్నారు. పతనం తిట్ట జిల్లాలో లాబస్సు బోల్తా పడగా, 18 మందికి గాయాలయ్యాయి. బాధితుల‌ను మెరుగైన చికిత్స కోసం పత్తనంతిట్ట ఆసుపత్రి నుండి కొట్టాయం మెడికల్ కళాశాలకు తరలించినట్లు సమాచారం. ప్రమాద ఘటన సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్, దెందులూరు శాసనసభ్యుడు అబ్బాయి చౌదరి, కేరళ అధికారులతో మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. సంఘటన తెలియగానే మాదేపల్లి గ్రామంలో తీవ్ర ఆందోళ‌న నెల‌కొంది. రెండు బస్సుల్లో 80 మంది ఈ యాత్రకు వెళ్ల‌డంతో ఆయా కుటుంబాల్లో ఎవరెవరు ప్రమాదంలో ఉన్నారో అని ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement