Tuesday, January 14, 2025

Tirumala | రెండో ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం !

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి తిరుమల వెళ్తున్న ఆర్టీసీ బస్సు… హరిణి వనం దాటిన తర్వాత అదుపు తప్పి ఘాట్ రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

ప్రమాదంపై వెంటనే టీటీడీ అధికారులు… సహాయక చర్యలు చేపట్టారు. పొక్లెయిన్‌ సాయంతో బస్సును తొలగించి ఘాట్‌ రోడ్డులో ఏర్ప‌డ్డ‌ ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement